శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చా? Worshiping Shiva Linga at home

శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చా? శివుడు అభిషేక ప్రియుడనే నానుడి యుగయుగాలుగా, భక్తుల మనస్సులలో నాటుకుపోయి ఉంది. క్షీర సాగర మధనంలో, లోక సంకటమైన కాలకూట విషం ముందుగా ఉద్భవించగా, ఆ విషాన్ని తన కంఠంలో దాచుకుని, గరళకంఠుడనే పేరును స్థిరపరుచుకున్నాడా పరమేశ్వరుడు. అలా తాను మింగిన విషం వలన కలిగే తాపం నుంచి రక్షించుకోవడానికే, ఆ స్వామి హిమగీరులపై నివశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అదే కారణాన ఆయన అభిషేక ప్రియుడిగా కూడా పేరుగాంచాడు. అలా అభిషేకం చేయడం ద్వారా శివయ్య త్వరగా ప్రసన్నం చెంది, కోరిన కోర్కెలు తిరుస్తాడాని, శాస్త్ర వచనం. అందుకే అనాదిగా మానవులనుంచి, దేవతల వరకు, ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోడానికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. అందులోనూ శివ రాత్రి నాడు స్వామికి చేసే అభిషేకం వల్ల మరింత పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే, శివరాత్రి నాడు తమ ఇంట్లోనే శివయ్యకు అభిషేకం చేసుకోవాలనుకునే వారిలో చాలా మందికి, అసలు ఆ స్వామికి ఏవిధమైన లింగం పెట్టుకుని అభిషేకం చేయాలి? అసలు ఇంట్లో శివ లింగానికి అభిషేకం చేసుకోవచ్చా, లేదా? అనే సందేహాలు కలుగుతుంటాయి. ఈ సృష్టిలో ఉన్న అతి శక్తివంతమైన ప్రతిమలలో, ...