సప్తబుుషులు ఆకలిబాధతో ‘శవాన్ని తినడానికి సిద్ధపడ్డారా’?
సప్తబుుషులు ఆకలిబాధతో ‘శవాన్ని తినడానికి సిద్ధపడ్డారా’? ధర్మరాజుతో భీష్ముడు చెప్పిన ‘సప్త బుుషులు - వృషాదర్భి మహారాజు కథ’! భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు, ఎన్నో గొప్ప గొప్ప విషయాలను ధర్మరాజుకు తెలియజేశాడు. రాజ్యాన్ని ఎలా పాలించాలి? ప్రజలను ఎలా చూసుకోవాలి? రాజనీతి, రాజపాలనకు సంబంధించీ, సమాజ జీవనానికి సంబంధించీ, అనేక ఉదాహరణలతో క్షుణ్ణంగా వివరించాడు, భీష్మ పితామహుడు. గాంగేయుడు తెలియజేసిన అనేక ధర్మ సూక్ష్మాల సంగ్రహణం నుండి, ఈ రోజుటి మన వీడియోలో, దానానికి సంబంధించి ధర్మరాజు అడిగిన ప్రశ్న, దానికి భీష్ముడు తెలియజేసిన సప్త బుుషులు - వృషాదర్భి మహారాజు కథను తెలుసుకుందాము. మరి ఆ కథేంటో, అందులో భీష్ముడు తెలియజేసిన నీతేంటో తెలుసుకోవాలనుకుంటే, ఈ వీడియోను చివరిదాకా చూడండి. మొత్తం వీడియో చూడకుండానే దయచేసి ఎవరూ కామెంట్ చేయవద్దని మనవి. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/XqWXGXTEZ8g ] ధర్మరాజు భీష్ముడితో, "పితామహా! ఉన్నదాంట్లో ఇతరులకు దానం చేసే వాడూ, ఎవరి వద్దా ఉచితంగా ఏమీ తీసుకొననివాడూ, వీరి గుణములు ఎలాంటివి?" అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు, "ధర్మనందనా! ఈ సందర్భంలో న...