Posts

యువక్రీతుడి కథ! Sustainable Attainment 'Story of Yuvakrita'

Image
రోమశ మహర్షి చెప్పిన యువక్రీతుడి కథ! గురుముఖతః నేర్చుకోని విద్య ఎందుకు పనికిరాదు? గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/P1cMnPseiNU ] మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా, ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుకా గురువు వుంటాడు. గురువు యొక్క విశిష్ఠత మన పురాణ గ్రంథాలలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎంత కఠోర దీక్ష చేసినా, ఎన్ని వరాలను పొందినా, గురుముఖతా నేర్చుకున్న విద్యకు సమానం కాదు. అందుకు ఉపమానంగా, పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు, వారి వెంట ఉన్న రోమశ మహర్షి, సంగమ నదీ తీరం వద్ద, యువక్రీతుని గురించి వివరించాడు. యువక్రీతుడు ఎందుకు ఘోర తపస్సుకు పూనుకున్నాడు? ఇంద్రుడిని అడిగిన వరం ఏంటి? ఒక మహర్షి చేతిలో అతని మరణం ఎందుకు సంభవించింది? అనేటటువంటి ఉత్సుకతను రేకేత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసకుందాము.. రైభ్యుడూ, భరద్వాజుడూ అనే మహా ఋషులిరువురూ మిత్రులు. వారిద్దరూ అడవిలో తపస్సులో నిమగ్నమయ్యారు. రైభ్యునిక...

మార్గశిర మాసం - Significance of Margasira Masam

Image
రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభం - మార్గశిర మాస విశిష్టత! ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుందని అందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో 'మాసానాం మార్గశీర్షోహం' అని చెప్పారంటే, హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో తెలుస్తుంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా, ఈ మాసంలోనే అని చెబుతారు. హిందువులు నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ, పరమ భక్తితో చేసుకునే ధనుర్మాస వ్రతం కూడా, ఈ మాసంలోనే మొదలవుతుంది. ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా, మంచి ఫలితాన్ని ఇస్తుంది. [ శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మార్గశిరమాస విశిష్టత: https://youtu.be/0IsB-um3hno ] శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఇదని అందరూ చెబుతుంటారు.. పెద్ధలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా, లేదా మోక్ష సాధనా మాసంగా కూడా చెబుతారు. భక్తితో ఉపవాసం, జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా, ఈ మాసంలోనే వస్తుంది. నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయం గురించి తెలుసుకుందాం.. మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి, ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. ...

మీకు తెలుసా?

షాడో ఇన్ బోర్నియో Shadow in Borneo by Madhubabu

Image
త్వరలో..  ' షాడో ఇన్ బోర్నియో ' Shadow in Bornio - షాడో స్పై అడ్వెంచర్ - మధుబాబు 02nd డిసెంబర్ నుండి ప్రారంభం.. Only on SMBAB కిల్లర్స్ గ్యాంగ్ వలలో చిక్కుకున్న బోర్నియో చక్రవర్తి, ఆర్ధిక, రాజకీయ, సామాజిక, వ్యక్తిగత ఇబ్బందులలో చిక్కుకుని విలవిలలాడుతూ, ద్వీపాన్ని అశాంతి, అల్ల కల్లోలం నుంచి రక్షించ లేని పరిస్థితులలో ఉన్నప్పుడు, ఇంటర్‌పోల్ అభ్యర్థన పై ఆ ద్వీపంలో అడుగు పెట్టిన షాడో, అనుక్షణం ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కున్నాడు? అనుకోని అతిథిలా తరచూ షాడోకి తారస పడుతున్న ఆ బోర్నియో విలాస సుందరి ఎవరు? అన్ని దుర్మార్గాలకు మూలకారణమైన చిన్ లీ చాన్ కథ ఎలా ముగిసింది? కిల్లర్ గ్యాంగ్ సుప్రీం కమాండ్ ప్రలోభాలనూ, ప్రతిహింసనూ షాడో ఎలా తిప్పి కొట్టాడు? 'షాడో ఇన్ బోర్నియో’ త్వరలో మీ ముందుకు! విని / చూసి ఆనందించండి!!

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka

Image
గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! శివుడి ఆగ్రహానికి గురైన కపిల గోవుకు ఎందుకంత ప్రాశస్త్యం? ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక, పవిత్ర గోమాత. భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవత. చతుర్వేదాలలోనే కాక, హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత, రామాయణ భాగవతాది పవిత్రగ్రంథాలలోనూ, గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి, గోపాలుడిగా, వాటి ప్రాముఖ్యతను వివరించాడు. దేవతలతో సరిసమాన కీర్తిని గడించిన గోవు ఎలా ఉద్భవించింది? గోవులలో కపిల గోవుకు ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది? అన్ని లోకాలలో కెల్లా గోలోకానికి అంత ప్రాశస్త్యం రావడానికి కారణమేంటి? అసలు మహాభారతంలో, గోవు విశిష్ఠత గురించి ఏం వివరించబడి ఉంది - వంటి ఆసక్తికర అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/iT2XRwhIgLQ ] పూర్వము విశ్వకర్మ, గొప్ప తపస్సుకు పూనుకున్నాడు. అమృత రూపిణి, కామరూపి అయిన సురభి అనే కన్యను, మానస పుత్రికగా సృష్టించాడు. ఆమెతో పాటు, మహా తేజోవంతుడైన ఒక పురుషుడిని కూడా సృష్టించాడు. ఆ పురుషుడు, ఆ కన్యను చూసి మోహించి, ఆమె...

చరిత్రలో మనం ఛత్రపతి శివాజీ గురించి పెద్దగా నేర్చుకోలేదు.. Facts about Shivaji Maharaj

Image
స్కూళ్ళలో చెప్పే చరిత్రలో మనం ఛత్రపతి శివాజీ గురించి పెద్దగా నేర్చుకోలేదు.. ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన యోధుడు: https://youtu.be/it7JY1jp20A ది గ్రేట్ ఎస్కేప్ - ఎక్కడ తగ్గాలో తెలిసిన అపరమేధావి: https://youtu.be/ay2IFCn95Wo చాలామంది ఆయన గురించి ఏమనుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు: "కాబూల్ నుండి కాందహార్ వరకు నా తైమూర్ కుటుంబం మొగల్ సుల్తానేట్‌ను సృష్టించింది. ఇరాక్, ఇరాన్, టర్కిస్తాన్ మరియు అనేక దేశాలలో, నా సైన్యం క్రూరమైన యోధులను ఓడించింది. కానీ, భారతదేశంలో శివాజీ మాకు బ్రేకులు వేశారు. నేను శివాజీకి నా గరిష్ట శక్తిని వెచ్చించాను, కానీ అతన్ని మోకాళ్ల మీదకు తీసుకురాలేకపోయాను.. యా అల్లాహ్, నువ్వు నాకు నిర్భయుడైన, మరియు నిటారుగా నిలబడ్డ శత్రువును ఇచ్చావు. దయచేసి అతని కోసం స్వర్గానికి తలుపులు తెరిచి ఉంచండి. ఎందుకంటే, ప్రపంచంలోని అత్యుత్తమ, మరియు విశాల హృదయం ఉన్న యోధుడు మీ వద్దకు వస్తున్నాడు" - ఔరంగజేబ్ (శివాజీ మరణానంతరం నమాజ్ చదువుతూ) "ఆ రోజు శివాజీ నా వేళ్లు నరికేయలేదు. కానీ, నా అహంకారాన్ని నరికేశాడు. నా కలలో కూడా ఆయనను కలవాలంటే భయం" - షాహిస్తా ఖాన్. "నా రాజ్యం...

అష్ట సాత్విక భావములు! భగవద్గీత Bhagavadgita

Image
అష్ట సాత్విక భావములు! హృదయంలో భక్తి ఉప్పొంగినప్పుడు భక్తులలో కనిపించే లక్షణాలేంటి? 'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (10 – 14 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 10 నుండి 14 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. అర్జునుడి, శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శన అనుభూతిని, సంజయుడు ఇలా వివరిస్తున్నాడు.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/aUdwm4wMXo4 ] 00:46 - అనేకవక్త్రనయనమ్ అనేకాద్భుతదర్శనమ్ । అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ।। 10 ।। 00:56 - దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ । సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం ।। 11 ।। ఆ యొక్క విశ్వ రూపములో, అర్జునుడు అనంతమైన ముఖములూ, మరియు కనులనూ దర్శించాడు. అవి ఎన్నెన్నో దివ్యమైన ఆభరణములనూ, మరియు అనేక రకాల దివ్య ఆయుధములనూ కలిగి ఉన్నాయి. ఆ స్వరూపము తన శరీరంపై అనేక మాలలను కలిగి ఉంది, మరియు దివ్య సుగంధ పరిమళభూరితమై గుబాళిస్తున్...