Posts

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

Image
జనవరి 1న ప్రపంచమంతా, కొత్త సంవత్సర వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే, ఈ జనవరి ఒకటి కొత్త సంవత్సరానికి ఆరంభం అనే విషయం వెనుక, చరిత్రతో పాటు, ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయనే విషయం, మనలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మనం వాడుతున్న ఈ Calendar ని ఎవరు కనిపెట్టారు? పూర్వం ఏ నెలలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు? మన దేశంలో, ఈ ఆంగ్ల Calendar ఎలా అమలులోకి వచ్చింది? అత్యంత పురాతన సంస్కృతి గల మన దేశంలో, జనవరి 1 న కొత్త సంవత్సరాన్ని ఎప్పుటి నుండి జరుపుకుంటున్నారు? అనేటటువంటి విషయాల గురించి, ఈ రోజు తెలుసుకుందాము..   జనవరి ఒకటి నుంచి, కొత్త సంవత్సరం ఆరంభం అవుతుందనీ, ఆ రోజుని New Year గా సంబరాలు జరుపుకోవడం వెనుక, చాలా పెద్ద చరిత్రే ఉందనీ చెప్పాలి. హిందూ, Babylonia, Zoroastrianism, Hebrew, Roman వంటి ప్రాచీన నాగరికతలకు చెందిన ప్రజలు, కొన్ని వేల ఏళ్ల క్రితం, వారి వారి క్యాలెండర్లను రూపొందించుకున్నారు. ఈ Calendars అన్నీ, సూర్యమానం, లేదా చంద్రమానం ఆధారంగా రూపొందినవే. అయితే, నేడు మనం ఉపయోగిస్తున్న ఆంగ్ల Calendar పుట్టుక, Roman Calendar నుంచి వచ్చింది. సామాన్య శక పూర్వం, 7000 సంవత్సరాల ముందు వ...

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur

Image
సంతాన భాగ్యాన్ని ప్రసాదించే 4 వేల సంవ‌త్సరాల నాటి హేమాచ‌ల నృసింహ‌ ఆల‌య ర‌హ‌స్యాలు! ఆర్త జ‌న బాంధవుడిగా, భ‌క్త కోటి ర‌క్షకుడిగా, శంఖచ‌క్రధారిని స‌మ‌స్త జనులూ, భ‌క్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. ధ‌ర్మ ర‌క్షణా, దుష్ట శిక్షణ కొర‌కు, ఆ శ్రీ మ‌హా విష్ణువు వివిధ అవ‌తారాలెత్తిన‌ట్లు, మ‌న‌ పురాణాలు చెబుతున్నాయి. ఆయనెత్తిన అవ‌తారాల‌లో, న‌ర‌సింహ స్వామి అవ‌తారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందువ‌ల్ల, ఆ స్వామిని యుగ‌యుగాలుగా,  సామాన్యుల నుంచి రారాజుల వ‌ర‌కూ, ఎన్నో ఆల‌యాల‌ను నిర్మించి, భ‌క్తితో కొలుస్తున్నారు. అటువంటి ఒ‌క పురాత‌న న‌ర‌సింహ స్వామి వారి ఆల‌యంలోని మూల‌విరాట్టు, ఎంతో ఆశ్చర్యాన్ని క‌లిగిస్తోంది. 4000 సంవ‌త్సరాల‌ మునుపు క‌ట్టిన ఆ ఆల‌యంలోని స్వామి వారి విగ్రహాన్ని చూసిన వారు, నోట మాట రాక, సంభ్రమాశ్చార్యాల‌లో మునిగిపోతే, శాస్త్రవేత్తలు మాత్రం, ఈ వింత ఎలా జ‌రుగుతోంద‌నే విష‌యం అంతుబ‌ట్టక, త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అంద‌రినీ ఆశ్చర్యప‌రుస్తోన్న ఆ న‌ర‌సింహ స్వామి వారి విగ్రహంలో దాగిన రహస్యమేంటి? ఆ ఆల‌యం ఎక్కడుంది?  దాని వెనుక‌నున్న అస‌లు చ‌రిత్ర ఏమిటి? అనే విష‌యాల‌ను, ఈ రోజు తెలుసుకుందాము.. ఈ ఆ...

నవ 'బ్రహ్మల' ఆలయాలు - Alampur Navabrahma Temples

Image
భగవంతుడు ఈ సృష్టిని రూపొందించిన క్రమంలో, రూపొందించిన తర్వాతా జరిగిన పరిణామాల గురించి, మన పురాణాలూ ఇతిహాసాలూ ఎంతో స్పష్టంగా తెలియజేస్తాయి. అటువంటి వాటిలో అతి ముఖ్యమైనవి, ఆది దేవుళ్ళయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించిన సంఘటనలని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ సృష్టిని నిర్మిండానికీ, దానిని నడిపించాడానికీ మూలం, ఆ త్రిమూర్తులే అనీ, అందుకే వారు ఆది దేవుళ్లుగా కీర్తింపబడుతున్నారనీ, శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, ఆ ముగ్గురిలో శివ కేశవులకు మన భూమిపై ఎన్నో ఆలయాలు ఉండగా, బ్రహ్మకు మాత్రం విగ్రహ పూజ, ఆలయాలూ ఉండవు. అందుకు కారణం, ఒకనాడు బ్రహ్మ దేవుడు చేసిన ఒక తప్పిదం వల్ల, శివుడు ఇచ్చిన శాపం అని మనలో చాలా మందికి తెలుసు. కానీ, మన తెలుగు రాష్ట్రంలో మాత్రం, ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా బ్రహ్మ దేవుడి పేరుమీద, తొమ్మిది ఆలయాలు ఉన్నాయి. అంతేకాదు, ఏ శివుడైతే బ్రహ్మకు విగ్రహారాధన ఉండకూడదని శాపమిచ్చాడో, అదే శివుడు, బ్రహ్మ పేరు మీద తొమ్మిది ఆలయాలు వెలియడానికి కారణమయ్యాడని, మన పురాణ ఇతిహాసాలూ, శాస్త్రాలూ చెబుతున్నాయి. ఈ మాటలు వినగానే, మన తెలుగు రాష్ట్రంలో ఆ నవ బ్రహ్మల ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఏకంగా ఒకే చోట, తొమ్మిది బ్...

సఫల ఏకాదశి - Saphala Ekadashi

Image
'సఫల ఏకాదశి' విశిష్టత.. ధనుర్మాసంలో వచ్చే చివరి పండుగ అయిన సఫల ఏకాదశి గురించి తెలుసుకుందాము..  ఈ సఫల ఏకాదశి మహాత్మ్యాన్ని, పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్లు, శాస్త్రాలు చెబతున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే, సఫల ఏకాదశి అని అంటారు. ఈ రోజున నిష్ఠతో ఉవవసించి, జాగరణ చేసి, శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా, పాపాలు నశించిపోతాయి, ముక్తి లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఉసిరితోనూ, దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి, సకల సంపదలో చేకూరుతాయి. ఈ రోజున రకరకాల పండ్లను స్వామికి సమర్పించి, ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తే, శుభప్రదం. ఈ సఫల ఏకాదశి రోజున దీప దానం చేస్తే, జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి, ఆలయాలలో దీపాలను వెలిగిస్తే, ఐదువేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి సమానమైన యజ్ఞం కానీ, తీర్థం కానీ లేదు. సఫల ఏకాదశి పవిత్రను చాటిచెప్పే కథను కూడా, శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు, పురాణాలు చెబతున్నాయి. పూర్వం చంపావతి రాజ్యమును మహిష్మంతుడనే రాజు పాలించేవాడు. అతనికి నలుగురు కుమారులుండేవారు. వారిలో జేష్ఠ పుత్రు...

సంపాతి కథ Story of Sampati

Image
యుగాలు నిరీక్షించిన ‘సంపాతి’.. సంపాతికి నిశాకర మహర్షి చూపిన మార్గమేమిటి? కశ్యప ప్రజాపతి, వినత దంపతులకు కలిగిన సంతానమైన అనూరుడు, శ్యేని ద్వారా, సంపాతి, జటాయువులనే కుమారులను పొందాడు. వీరి పాత్ర రామాయణంలోని ముఖ్య ఘట్టాలలో కనిపిస్తుంది. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించిన సందర్భంలో, జటాయువు ఆమెను కాపాడబోయి, మరణించిన విషయం మనలో చాలామందికి తెలిసిందే. ఇక సంపాతి తన రెక్కలను ఎందుకు కొల్పోయాడు? వానరులను ఎలా కలిశాడు? సంపాతి రెక్కలు తిరిగి రావడానికి నిశాకర మహర్షి ఉపదేశించిన మార్గం ఏమిటి - వంటి ఆసక్తికర అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/fuBE0AZCoNA ] సీతమ్మను వెతకడానికి దక్షిణ దిశకు వెళ్ళిన జాంబవంత, హనుమదాది మహావీరుల బృందానికి, అంగదుడు నాయకుడు. అన్వేషణ దాదాపు విఫలమైందని భావించి, ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు మాత్రమే, నిసృహతో అంగదుడు సుగ్రీవుని విమర్శించడం గమనార్హం. అది తప్పితే, మిగిలిన అన్ని సందర్భాలలోనూ అతని రాజ భక్తీ, రామకార్యం పట్ల నిరతీ, చాలా దృఢంగా ప్రదర్శించాడు. ఇక అసలు విషయానికి వస్తే, ఆ సమయంలో అంగదుడు, "శ్రీ రాముడి కార్యం నె...

భూత కోలా అంటే ఏమిటి? Bhoota Kola or Buta Kola of Kantara

Image
భూత కోలా అంటే ఏమిటి? అందులో ఎటువంటి శక్తులను పూజిస్తారో తెలుసా? ఇప్పుడు దేశమంతటా మారుమ్రోగిపోతున్న పేరు 'భూత కోలా'. మొన్నీ మధ్య రిలీజ్ అయిన 'కాంతార' అనే కన్నడ సినిమాలో ఈ భూత కోలా గురించి ఎంతో విశేషంగా చెప్పారు. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో, ఇప్పుడు దేశమంతా 'భూత కోలా' అంటే ఏమిటి? 'పంజర్లీ' అంటే ఏమిటి? 'గుళిగ' అనే దేవత ఎవరు? భూతం అంటే అదో దుష్ట శక్తి కదా, అటువంటి దుష్ట శక్తిని కొలవడం ఏమిటి? ఈ వింత సంస్కృతి గురించి ఇన్నాళ్ళూ మనకు ఎందుకు తెలియలేదు? ఈ సంస్కృతిని ఎవరు? ఎక్కడ ఎక్కువగా పాటిస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఈ సంస్కృతి మనుగడలో ఉంది? వంటి ప్రశ్నలపై, దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందువల్ల, ఈ భూత కోలా గురించి వివరంగా తెలుసుకోవాలంటే, ఈ శీర్షికను పూర్తిగా చదవండి. ఈ ప్రపంచంలో మరెక్కడా చూడని ఎన్నో ఆచార వ్యవహారాలకు ఆలవాలం, మన భారత దేశం. ఎందుకంటే, ఈ భూమిపై మొట్ట మొదటిసారి నాగరికత సాధించిన ఏకైక దేశం మన దేశమే అవ్వడంతో, ఈ అఖండ భారతావనిలో ఎక్కడికి వెళ్ళినా, కొన్ని యుగాల నాటి ఆచార వ్యవహారాలూ, నాటి తాలుకు గుర్తులూ, ఏదో ఒక విధంగా కనిపిస్తూనే ఉంటాయి. అటువంటి...

దృష్టికి పెట్టుకునే రాగి యంత్రాలు Drishti Yantras

Image
దృష్టికి పెట్టుకునే రాగి యంత్రాలు పూజ గదిలో పెట్టుకోవచ్చా? అసలు రాగి యంత్రాల వల్ల ప్రయోజనం ఉందా? ఇది చదివితే మీకే అర్ధం అవుతుంది.. మనిషి ఉదయం లేచినప్పటి నుంచి, రాత్రి పడుకునేంత వరకు, ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో, ఇతరులు మనల్ని చూసో, మన ఇంటిని చూసో, ఈర్ష్య చెందుతుంటారు. దాని వల్ల, మనకు తెలియకుండానే దృష్టి ప్రభావం ఇంటిపై పడటం వల్ల, ఆ ఇంట్లోని వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, ఆ దృష్టి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి, ఇంటికి బూడిద గుమ్మడికాయను కట్టడం, ఇంటికి దృష్టి తీయయడం వంటి కొన్ని పరిహారాల గురించి, ధర్మ సందేహాలలో స్పష్టంగా చెప్పబడింది. అయితే, మనలో చాలా మంది, దృష్టి పోడానికి కొన్ని రాగి రేకు యంత్రాలను సైతం తెచ్చుకుని, ఇంటి ముందు కట్టుకుంటారు. కానీ మరికొంతమంది, వాటిని దేవుడి గదిలో కూడా పెట్టుకోవడం చూస్తుంటాము. ఆ రాగి రేకులను పూజ గదిలో పెట్టుకోవచ్చా, లేదా? రాగి రేకుల వల్ల దృష్టి నిజంగా పోతుందా? దృష్టిని తొలగించే యంత్రాలను, దేవుడి గదిలో ఎందుకు పెట్టమని చెబుతున్నారు? వంటి సందేహాలు ఎన్నో, మనలో చాలా మందికి కలగకమానవు. అటువంటి సందేహాలకు సమాధానాలు తెలియయాలంటే, ఈ శీర్షికన...