Posts

ఈ రోజు '31-03-2023' ధర్మరాజ దశమి! Dharmaraja Dasami

Image
  ఈ రోజు '31-03-2023' ధర్మరాజ దశమి! ఈ పుణ్య దినాన్ని 'ధర్మరాజ దశమి' లేదా 'యమ ధర్మరాజ దశమి' అంటారు. ఈ రోజు, మరణానికి దేవుడయిన యమ భగవానుడికి అంకితం చేయబడింది. యమధర్మరాజు అని కూడా పిలువబడే ధర్మరాజుకు అంకితం చేసిన పూజ ఈ రోజు జరుగుతుంది. ఈ వ్రతాన్ని 10వ రోజు చైత్ర మాసం శుక్ల పక్షంలో పాటిస్తారు. ప్రాథమికంగా ఈ రోజున చేసే పూజలు, భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించే దిశగా ఉంటాయి. మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమ నివాసానికి వెళ్ళిన కథ, ఉపనిషత్తులోని యువ నచికేతుల కథ, వినడం ఆనందంగా ఉంటుంది. ఉపనిషత్తులకు వేదాంతాలు అని పేరు. ఆధ్మాత్మిక జ్ఞానంలోని లోతును 'వేదాంతం' అని పిలుచుకునేంతగా ఉపనిషత్తులు భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తున్నాయి. ఉపనిషత్తులో అక్కడక్కడా కొన్ని కథలు కనిపించినా, వాటిలో సత్యకామజాబాలి, నచికేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉంది. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామజాబాలి చెబితే, అన్న మాటకు కట్టుబడాలి అని నచికేతుని కథ ప్రస్ఫుటం చేస్తుంది.. [ పిచ్చుకల రూపంలో ధర్మదేవతలు జాబాలికి నేర్పిన గుణపాఠం: https://youtu.be/L4UeG2rUorU ] ఇక న...

ప్రకృతి గర్భము వంటిది, ఆత్మలు రేతస్సు వంటివి! భగవద్గీత Bhagavadgita

Image
  జీవాత్మ - దేహము! ప్రకృతి గర్భము వంటిది, ఆత్మలు రేతస్సు వంటివి! 'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (01 – 04 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 01 నుండి 04 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/VswiutHKUvg ] ఈ అధ్యాయము, దేహము మరియు దాని మూలకముల యొక్క మూలశక్తి అయిన భౌతిక శక్తి యొక్క స్వభావమును వివరిస్తుంది. 00:50 - శ్రీ భగవానువాచ । పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ । యద్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ।। 1 ।। శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్టమైన విద్యనూ, అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమునూ నీకు వివరిస్తాను; ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ, అత్యున్నత పరిపూర్ణతను సాధించారు. గతంలో శ్రీ కృష్ణుడు, ఆత్మ మరియు భౌతిక పదార్ధ మేళనముతోనే, సమస్త జీవ భూతములూ తయారైనాయని చెప్పి ఉన...

ఆనాడు రాముడు చేసినపని ధర్మబద్ధమేనా? Killing Vali: Rama's Confession

Image
ఆనాడు రాముడు చేసినపని ధర్మబద్ధమేనా? రాముడు చేసిన తప్పు ద్వాపర యుగంలో శాపంగా మారిందా? మన పురాణాలనుంచి మనం నేర్చుకోవలసిన ధర్మసూక్ష్మాలు కోకొల్లలు. రామాయణంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వారు, ఇంద్ర, సూర్య తనయులైన వాలి, సుగ్రీవుల గురించి. వానర జాతిలో మహా బలవంతులూ, పరాక్రమవంతులుగా పేరుగడించిన ఆ సోదరులు, చివరకు శత్రువులయ్యారు. ప్రతిదినమూ బ్రహ్మ ముహుర్తంలోనే నిద్దురలేచి, నాలుగు సముద్రములకు వెళ్లి, సంధ్యోపాసన గావించేవాడు వాలి. పర్వతాల పైకెక్కి, వాటి శిఖరములను కూల్చి, వాటితో బంతాట ఆడుకునేవాడు. పది తలల రావణుడిని మూడు మార్లు ఓడించిన వీరుడు. అంతటి బలవంతుడైన వాలిని, రాముడు చెట్టు చాటు నుండి అంతమొందించడానికి అసలు కారణం, అతని బలమా, గుణమా? రాముడు వాలిని చంపడం ధర్మబద్ధంగానే జరిగిందా - వంటి ధర్మాధర్మ వితార్కానికి గురిజేసే ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/9LXSsYA2RbE ] వాలి, సుగ్రీవుల యుద్ధంలో, కొన ప్రాణాలతో వున్న వాలిని సమీపించారు రామలక్ష్మణులు. వారిని చూడగానే, పరుష పదములతో నిందించాడు వాలి. ‘‘నీతోయుద్...

భౌతికమైన క్షేత్రము, మరియు అలౌకికమైన క్షేత్రజ్ఞుడంటే ఏమిటి? భగవద్గీత Bhagavadgita

Image
  అందరికీ శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 💐 పరమ పదము! భౌతికమైన క్షేత్రము, మరియు అలౌకికమైన క్షేత్రజ్ఞుడంటే ఏమిటి? 'భగవద్గీత' త్రయోదశాధ్యాయం – క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం (31 – 35 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదమూడవ అధ్యాయం, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములోని 31 నుండి 35 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/ogh8suoqPWc ] ఆత్మ అనేది, శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాకుండా ఎలా ఉండగలదో, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు.. 00:50 - యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి । తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ।। 31 ।। విభిన్న వైవిద్యములతో కూడిన జీవరాశులన్నీ, ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడూ, మరియు అవన్నీ దానినుండే ఉద్భవించినవని అర్థం చేసుకున్నప్పుడూ, వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు. సముద్రము తానే అలలుగా, నురగగా, సుడులుగా, తరంగములగా మార్చుకుంటుంది. ఎవర...

ముస్లిం యువతిని శ్రీనివాసుడు పెళ్లాడాడా? Shocking facts about Bibi Nanchari

Image
ముస్లిం యువతిని శ్రీనివాసుడు పెళ్లాడాడా? శ్రీరంగంలో నిత్యం పూజలందుకుంటున్న ముస్లిం యువతి ఎవరు? కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునికి భార్యలుగా పద్మావతి.. అలిమేలు మంగలతో పాటు, తిరుమలలో తుళుక్క నాచియార్ పేరుతో పూజలందుకుంటున్న ఒక ముస్లిం యువతి గురించి, చాలా మందికి తెలిసే ఉంటుంది. అసలు ఆమె ఎవరు? ముస్లిం యువతి వేంకటేశ్వరుని భార్య ఎలా అయ్యింది? అనేటటువంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/L-zdTXdLyVs ] శ్రీ వేంకటేశ్వరుడూ, బీబీ నాంచారీల వివాహం మీద, మన దేశంలో పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. నాచియార్‌ అనే త‌మిళ ప‌దం నుంచి, నాంచార‌మ్మ అన్న పేరు వ‌చ్చింద‌ని చెబుతారు. నాచియార్ అంటే, భ‌క్తురాలు అని అర్థం. ఇక బీబీ అంటే భార్య అని అర్థం. బీబీ నాంచార‌మ్మ గాథ ఈనాటిది కాదు. క‌నీసం ఏడు వంద‌ల సంవ‌త్సరాల నుంచి, ఈమె క‌థ జ‌న‌ప‌దంలో నిలిచి ఉంది. అయితే, ఆమెకు సంబంధించి ముఖ్యంగా చెప్పుకునే కథలలో, బీబీ నాంచార‌మ్మ, మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె. ఆమె అస‌లు పేరు సుర‌తాని. స్వత‌హాగా హిందువైన మాలిక్ కాఫిర్, అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి, తాను కూడ...

యధార్ధమైన జ్ఞానం! భగవద్గీత Bhagavadgita

Image
  పని చేసేటప్పుడు ఫలితములు నీ పరిశ్రమ మీదనే ఆధారపడి ఉన్నట్లు పరిశ్రమించాలి! 'భగవద్గీత' త్రయోదశాధ్యాయం – క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం (25 – 30 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదమూడవ అధ్యాయం, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములోని 25 నుండి 30 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/VmldzgSwQps ] కొన్ని ఆధ్యాత్మిక సాధనల గురించి, శ్రీ కృష్ణుడి వివరణ ఇలా సాగుతోంది.. 00:48 - ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా । అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ।। 25 ।। కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు. ఇతరులు దీనినే, జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు. మరికొందరు, ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు. వైవిద్యమనేది, భగవంతుని సృష్టి అంతటా ఉన్న లక్షణము. ఒకే చెట్టుకు ఉన్న ఏ రెండు ఆకులూ, ఒక్క లాగే ఉండ...

స్వారోచిష మన్వంతరం! హంస నేర్పిన జ్ఞానబోధ! Swarochisha Manu

Image
  స్వారోచిష మన్వంతరం! హంస నేర్పిన జ్ఞానబోధ! వరూధుని కుమారుడైన స్వరోచి, ఆయుర్వేద విద్యా, సమస్త ప్రాణుల స్వరాలను వినే విద్యా, పద్మినీ విద్యలను ఎలా పొందగలిగాడు? స్వరోచిని మనోరమ వివాహం చేసుకోవడానికి పెట్టిన షరతు ఏంటి? ముగ్గురు భార్యలున్న స్వరోచి, వనదేవతను పెళ్ళి చేసుకోవడానికి గల కారణమేంటి? స్వరోచి మోక్షాన్ని పొందడానికి హంస ఏవిధంగా సహయపడింది - వంటి ఆసక్తిని కలిగించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వరూధుని కుమరుడైన స్వరోచి జననం, స్వరోచి, మనోరమల సమాగమం, ఇందీవరాక్షుడి శాప విమోచనానికి సంబంధించిన వీడియోల లింక్స్ ను, చూడనివారికోసం పొందుపరిచాను. 1. వరూధిని – ప్రవరాఖ్యుడు!: https://youtu.be/YH-TpjvybSA 2. స్వరోచి జన్మ రహస్యం!: https://youtu.be/ytYeyP4Jmr0 3. స్వారోచిష మన్వంతరం!: https://youtu.be/qA48HPtKTuo తనను రాక్షస రూపం నుంచి విముక్తుడిని చేసినందుకు, ఇందీవరాక్షుడు తన కుమార్తె మనోరమను, స్వరోచికి సమర్పించాడు. దాంతో మనోరమ తన తండ్రితో, "తండ్రీ, నాకుకూడా నన్ను రక్షించిన ఈ మహా వీరుడంటే ఇష్టమే. నేను ఇతన్ని మనసార స్వీకరిస్తాను. అయితే, ఇది సందర్భం కాదు. నా ప్రియ చెలులు ఇద్దరూ కుష్ఠు, ...