అమ్మకి 2 రూపాయలు అవసరమా!?
అమ్మకి 2 రూపాయలు అవసరమా!? ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురించబడిన ఈ కథ, కేవలం రెండు పేజీలే వుంటుంది. కానీ, కథ పూర్తయ్యాక రెండు నిమిషాలయినా మనం ఆలోచించకుండా వుండలేము.. ఈ కథలో చెప్పినదానికన్నా చెప్పకుండా వున్నదే ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్క రెండు రూపాయలు.. "నేనేం వందలడిగానా? వేలడిగానా? ఒక్క రెండు రూపాయలేగా! దానికే అంత దండకం చదవాలా?" గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడుతూనే మెలకువ వచ్చింది నూకరాజుకి. గబుక్కున లేచి కూర్చున్నాడు. "ఆఁ!...ఒక్క రెండు రూపాయలేగా అని ఎంత తీసి పడేస్తున్నావు? పిల్లలు ఖర్చులకడిగేదీ అదే. పుస్తకాలకడీగేదీ అదే. రెండూ రెండూ అంటూ నాలుగు సార్లు కలిపితే ఎనిమిదవదా? పదీ పదీ కలుపుకుంటూ పోతే వందవదా? ఇలాగే లెక్కలు పెడతాడు నీకొడుకు. రోజు రోజుకీ పెరిగి పోతున్న ధరలతో, నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తలప్రాణం తోకకొస్తోంది. అయినా ముసల్దానివయిపోయావు. ఇంట్లోంచి బైటకి కదలవు. భోజనం, కాఫీ, టిఫినూ అన్నీ చెల్లిస్తూనే వున్నావాయె. ఇంకా నీకు ఆ ఒక్క రెండు రూపాయలు మటుకు ఎందు...