Posts

సందిగ్ధావస్థ! భగవద్గీత Bhagavadgita

Image
సందిగ్ధావస్థ! వేర్వేరు యుగాలలో మంచి చెడుల తారతమ్యం! 'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (05 – 08 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 5 నుండి 8 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/zEORvI6uU9s ] ఆసురీ గుణాల పూర్తి వివరణను, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు.. 00:46 - దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా । మా శుచః సంపదం దైవీమభిజాతోఽసి పాండవ ।। 5 ।।  దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి. కానీ, ఆసురీ గుణములు, బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమౌతాయి. శోకింపకుము అర్జునా.. నీవు దైవీ గుణములతోనే జన్మించినవాడవు. శ్రీ కృష్ణుడు ఈ రెండు స్వభావాల పరిణామాలను వివరిస్తున్నాడు. ఆసురీ గుణములు, వ్యక్తిని జన్మ-మృత్యు-సంసార బంధనాలకు కట్టివేస్తాయని చెబుతున్నాడు. అదే సమయంలో, దైవీ గుణములను పెంపొందించు కోవటం, మాయా బంధనము నుండి విముక్తి...

Invincible King Durjaya and Maharshi Gauramukha

Image
ముల్లోకాలనూ జయించిన రాజుతో యుద్ధానికి దిగిన ముని పుంగవుడెవరు? తన వరప్రభావంతో జన్మించిన అతనిని విష్ణువు ఎందుకు సంహరించాడు? మన పురాణాలలో కొందరు అసురులూ, రాక్షసులూ దేవుని భక్తులుగానే కనిపిస్తుంటారు. అనన్యమైన, అమోఘమైన దైవచింతన ఉన్నప్పటికీ, వారి స్వార్థపూరిత ఆలోచనలతో, ఇతరులను హింసించేటటువంటి క్రూరమైన స్వభావంతో, దైత్యులుగా నిందింపబడేవారూ ఉన్నారు. ఇక మునులలో కూడా శాంత స్వభాంతో, తమ ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా వదిలేసిన వారున్నారు, అసురులను సైతం ఎదిరించి, దైవ బలంతో వారిని అంతమొందించిన వారూ ఉన్నారు. అసుర లక్షణాలు కలిగిన రాజుతో, ఒక ముని ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది? రాజుతో యుద్ధానికి దారి తీసిన కారణాలేంటి? ముని జరిపిన యుద్ధం ఫలించిందా? వరాహపురాణంలో వివరించబడిన ఈ కథకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/tbv0awTt3E0 ] కృతయుగంలో సుప్రతీకుడనే రాజు ఉండేవాడు. అతనికి విద్యుత్ప్రభ, కాంతిమతి అనే ఇద్దరు భార్యలున్నారు. సంతానహీనుడైన సుప్రతీకుడు, చిత్రకూట పర్వతంపై ఉన్న ఆత్రేయుడనే మున...

అత్యున్నత లక్ష్యం! దైవీ స్వభావం యొక్క ఇరవై ఆరు గుణములను శ్రీ కృష్ణుడు ఏమని వివరించాడు? భగవద్గీత Bhagavadgita

Image
అత్యున్నత లక్ష్యం! దైవీ స్వభావం యొక్క ఇరవై ఆరు గుణములను శ్రీ కృష్ణుడు ఏమని వివరించాడు? భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 1 నుండి 4 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/XiCTrae3dQg ] మనుష్యులలో ఉండే రెండు రకాల స్వభావాలైన దైవీ గుణాలు, మరియు ఆసురీ గుణాలను, శ్రీ కృష్ణుడిలా వివరించబోతున్నాడు. 00:50 - శ్రీ భగవానువాచ । అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః । దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ।। 1 ।। 01:01 - అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునమ్ । దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ ।। 2 ।। 01:11 - తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా । భవంతి సంపదం దైవీమభిజాతస్య భారత ।। 3 ।। శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ భరత వంశీయుడా, దైవీ సంపద కలవాని లక్షణములు - నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో ధృఢసంకల్పము, దానము, ఇంద్రియ...

కపట సన్యాసి - మహారాజు! ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన కథ! Greed Is The Blindfold That Blocks Your Mind!

Image
కపట సన్యాసి - మహారాజు! ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన కథ! రావణుని జన్మకు కారణం, ఆ లక్ష మంది విప్రుల శాపమా? సమస్త భూమండలానికీ ఎలిక అయిన కైకయ రాజు ప్రతాపభానుడు, సద్గుణ సంపన్నుడూ, గొప్పయోధుడు. అతని ప్రియ సోదరుడైన అరిమర్దనుడు మహా బలశాలి, వీరుడు. ప్రతాపభానుని మంత్రి ధర్మరుచి. అతడు నీతిజ్ఞుడు, బుద్ధిమంతుడు. తన దిగ్విజయ యాత్రలో, ఆ రాజు సప్తద్వీపాలనూ జయించి, సమస్త భూమండలానికీ ఏకైకచక్రవర్తి అయ్యాడు. మంత్రి అయిన ధర్మరుచి ప్రభావమువలన, ఆ రాజు గురువులనూ, దేవతలనూ, సాధు సజ్జనులనూ, పితరులనూ, భూసురులనూ, భక్తి విశ్వాసాలతో సేవించేవాడు. రాజ ధర్మాలను వేదోక్తంగా పాటిస్తూ, నిత్యం అనేక దాన ధర్మాలు చేసేవాడు. పురాణేతిహాసాలను భక్తి శ్రద్ధలతో వినేవాడు. ఎన్నో బావులూ, చెఱువులూ, ఉద్యానవనాలూ, దేవతా మందిరాలూ కట్టించి, ప్రజా రంజకంగా రాజ్యపాలన చేశాడు. వనాలలో ఆశ్రమాలను నిర్మించుకున్న మహర్షులు, తమ తపశ్శక్తిలో ఆరవ భాగం రాజులకు ధార పోస్తారు. ఆ శక్తితో రాజులు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తుంటారు. అందుకే, లోకహితులైన మహర్షులను క్రూరమృగాలనుండి కాపాడటం, రాజుల విధి. మునుల కార్యార్థం అడవికి వెళ్ళిన  మహారాజు, ఒక కపట సన్యాసి వలన ఏ విధం...

సర్వోన్నత జ్ఞానం! భగవద్గీత Bhagavadgita

Image
సర్వోన్నత జ్ఞానం! ఈ జ్ఞానమును స్వీకరించి అంగీకరించినవారు యదార్థముగా జ్ఞానోదయం పొందుతారా? 'భగవద్గీత' పంచదశోధ్యాయం - పురుషోత్తమ ప్రాప్తి యోగం (16 – 20 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదునైదవ అధ్యాయం, పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, పురుషోత్తమ ప్రాప్తి యోగములోని, 16 నుండి 20 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/WrzxKc8Ch5A ] నాశరహిత పరమాత్మయైన ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుడి గురించిన వివరణ, ఇలా ఉండబోతోంది.. 00:47 - ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ । క్షరః సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే ।। 16 ।। సృష్టిలో రెండు రకాల ప్రాణులు ఉన్నాయి.. క్షరములు అంటే, నశించేవి, మరియు అక్షరములు అంటే, నశించనివి. భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు. అక్షరములు అంటే, మోక్షము పొందిన జీవులు. భౌతిక జగత్తులో, మాయ అనేది జీవాత్మను ఈ భౌతిక శరీరమునకు కట్టివేస్తుంది. ఆత్మ అనేది, నిత్యసనాతనమైనది అయినా కూడా, అది పదేపదే శరీరము యొక్క...

నారదుడు చెప్పిన ‘షోడశ రాజులు’ ఎవరు? 16 Sixteen (Shodasa) Chakravarthis or Emperors Story

Image
నారదుడు చెప్పిన ‘షోడశ రాజులు’ ఎవరు? పుట్టిన ప్రతి జీవీ మరణించక తప్పదు! దుఃఖమయమైన ఈ లోకంలో మానవుడి గమ్యమేంటి? ద్రోణాచార్యుడు నిర్మించిన బేధించనలవికాని పద్మవ్యూహంలోకి, ధైర్యంతో, శౌర్యంతో చొచ్చుకుపోయి, ఎందరో కౌరవ వీరులను సంహరించి, వీరమరణం పొందాడు అభిమన్యుడు. బాలుడైనప్పటికీ, సైన్యంలో చొచ్చుకొని పోవడానికి సమర్థుడని యుద్ధానికి పంపాననీ, అర్జునుడు వచ్చి తన కొడుకేడని అడిగితే, ఏం సమాధానం చెప్పాలో తెలియక, బాధతో కృంగిపోయాడు ధర్మరాజు. యుద్ధానికి పంపి తాను పాపం చేశాననీ, అభిమన్యుడి వెంట తాను యుద్ధంలోకి చొచ్చుకు పోలేకపోయాననీ చింతించాడు. ఇలా పలు విధాలుగా దుఃఖిస్తున్న ధర్మరాజు దగ్గరకు, వ్యాసమహర్షి వెళ్ళాడు. తాను పద్మవ్యూహంలోకి బాలుడైన అభిమన్యుడిని పంపిన విషయం, అతడి వెనుకే తాము పోవడానికి ప్రయత్నించగా, సైంధవుడు అడ్డు తగిలిన విషయం, ఆ విధంగా అభిమన్యుడికి సహకరించే అవకాశం తప్పిపోయిన వైనం, అప్పుడు పలువురు కౌరవ వీరులు అతడిని చుట్టుముట్టి, అన్యాయంగా హతమార్చిన విషయం, వేదవ్యాసుడికి చెప్పాడు ధర్మరాజు. తనలాంటి కఠినాత్ముడు లేడంటూ, జరిగిన దారుణానికి చింతించాడు. మిక్కిలి బలవంతుడైన అభిమన్యుడు చిన్నబాలుడు కాడనీ, ఎంతోమంది...

గుప్పెడు మనస్సు - మంచిమాట Manchimata

Image
గుప్పెడు మనస్సు - మంచిమాట అవకాశం లభించాలే కానీ, మనం జ్ఞానులమని ఇతరులు గుర్తించాలనేలా ప్రవర్తిస్తాము. మౌలికంగా మనం తెలివి గలవారమని మన నమ్మకం. ఇతరులు ఏదైనా చెబితే దానిని ఖండించేందుకు, మాటలను అన్వేషిస్తాము. అవసరం లేని గర్వాన్ని పెంచుకుంటాము. దానితో అరిషడ్వర్గాలన్నీ మనలను ఆవహిస్తాయి. వీటితోపాటు, అతిశయం అంతరంగంలోకి చేరుతుంది. [ మంచిమాట Playlist: https://www.youtube.com/playlist?list=PLNoNQLGbZ7gbq-DusM1YjHrgyBxuhCXRi ] ఈ ప్రపంచంలో తెలివి అన్నది ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఈ చిన్న నిజాన్ని మనం తెలుసుకో లేక పోతున్నాము. తెలివితేటలంటే మనకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని చర్వితచర్వణం చేయడమా? అందులో మన సొంతం ఒక్కటీ ఉండదు. మన ప్రజ్ఞ ఎక్కడా ప్రస్ఫుటం కాదు. అన్నీ అరువు తెచ్చుకున్నవే. మన సొంత జ్ఞానం ఏ పాటిదని మనం ఎందుకు విశ్లేషించుకోము? మనలో మౌలికత లేదు.. క్రియాశీలత అంతంత మాత్రమే.. ఇది నా ఆలోచన, ఇది నా ప్రజ్ఞా విశేషం, ఇది నేను తెలుసుకున్న సత్యం - అని ఒక్కటంటే ఒక్కదానిని చూపగలుగుతున్నామా? పైగా ఇతరులు ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే, ససేమిరా వినం. అమెరికాలోని చికాగోలో సార్వత్రిక మత సమ్మేళనం జరిగినప్పుడు, ఆ సభల్లో పా...