దానం సక్రమమైనదా, ఉన్నతమైనదా, నీచమైనదా అనేది ఎలా నిర్ణయించబడుతుంది? భగవద్గీత Bhagavad Gita
దానం సక్రమమైనదా, ఉన్నతమైనదా, నీచమైనదా అనేది ఎలా నిర్ణయించబడుతుంది? 'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (17 – 20 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 17 నుండి 20 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/8AVAHaPcbmw ] రజో గుణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము.. 00:45 - శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః । అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే ।। 17 ।। భక్తి-శ్రద్ధలు కల వ్యక్తులు, అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులనూ, భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే, వాటిని సాత్త్విక తపస్సులని అంటారు. శారీరక, వాక్కు, మరియు మనస్సులకు సంబంధించిన తపస్సులను వేర్వేరుగా, స్పష్టంగా వివరించిన తరువాత, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, సత్త్వ గుణములో చేసే వాటి లక్షణములను వివరిస్తున్నాడు. భౌతిక ప్రతిఫలములను ఆశించి చేయబడితే, తపస్సు దాని ...