Posts

నరబలి! ఏం నేర్పింది? Sacrifice of Satamanyu

Image
నరబలి! ఏం నేర్పింది?  TELUGU VOICE వేల సంవత్సరాల క్రితం గ్రంధస్థం చేయబడిన మన సనాతన ధర్మ గ్రంధాలలో చెప్పబడిన గాధలు, నేటికీ మనకు ఆదర్శదాయకాలే.. నేటి మన పరిస్థితులకు మార్గదర్శకాలే.. అటువంటి ఉత్తమ సన్మార్గ కథలలో కొన్ని ఇదివరకే మనము చెప్పుకుని ఉన్నాము. మరొక మంచి కథను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. వీడియోను చివరిదాకా చూసి, మీకు అనిపించిన మంచినీ, మీ అభిప్రాయాన్నీ comment చేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/VvQgufypfeI ] ఒకప్పుడు ఒక రాజ్యంలో రెండేళ్ళ పాటు వానలు కురవలేదు. వర్షాలు లేని కారణంగా, కరవు కాటకాలు తాండవించి, జనులు అల్లల్లాడి పోయారు. చెట్లూ చేమలూ మోడువారాయి. ఎక్కడ చూసినా పచ్చదనం అనేది మచ్చుకకు కూడా లేకుండా పోయింది. తాగడానికి నీరు కూడా లభించక, జనులు నానా అవస్థలూ పడసాగారు. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే, ఇక మూగ జీవాల పరిస్థితి మరీ దారుణం. పశుగణాలు వేల సంఖ్యలో నేలకొరగ సాగాయి. ఈ స్థితిలో జనులకు వాటిల్లిన కష్టాన్ని ఎలా తీర్చాలా! అని రాజు దీర్ఘంగా యోచించి, కరవు తీరడానికి ఏదైనా పరిహారం కనుగొనాలని నిశ్చయించుకున్నాడు. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ ...

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

Image
శ్రీ కృష్ణ లీలలు!  TELUGU VOICE అది మండు వేసవి. మధ్యాహ్నం ఒంటి గంట దాటింది. పండు ముదుసలి, రామ భక్తురాలు అయిన ఒక అవ్వ, తలపై బరువైన పళ్ళ బుట్టతో, వేణు గోపాల స్వామి గుడి దగ్గర కాసేపు నీడలో కూర్చుందామని వచ్చింది. మెల్లగా బుట్టను క్రిందికి దించింది. చెమట పట్టిన ఆ ముడుతల ముఖాన్ని తుడుచుకుంటూ, "నాయనా గోపాలా! ఊరంతా తిరిగాను. ఒక్క పండు కూడా అమ్మలేదు. ఈ రోజు పస్తేనా స్వామీ?" అని ఆ వేణు గోపాలుని విగ్రహం వైపు చూస్తూ తనలో తాను అనుకున్నది. [ శ్రీ కృష్ణుడి అయిదుగురు తల్లులు! https://youtu.be/AbSSImIw2-4 ] ఇంతలో ఒక బాలుడు, నుదుటిపై కస్తూరీ తిలకం, వక్ష స్థలంపై కౌస్తుభ హారం, నాసాగ్రమున నవమౌక్తికం,  కంఠాన ముత్యాలహారం, చేతిలో పిల్లన గ్రోవి, శిఖలో నెమలి పింఛంతో, ఆ అవ్వ వైపుగా వస్తున్నాడు. ఆ బాలుడు ఎవరోకాదు, వేణు గోపాలుడే.. ఎవరా అన్నట్లు, ఆ అవ్వ అలా చూస్తోంది. దగ్గరగా వచ్చిన బాలుని చూసింది. తాదాత్మ్యంతో ఆ లీలా మానుష రూపధారిని చూస్తూ, 'అయినా కలియుగంలో భగవంతుని దర్శనం ఏమిటిలే' అనుకున్నది.  "అవ్వా, ఈ పళ్ళు తీయగా ఉంటాయా?" అడిగాడు బాలుడు. "అవును కన్నా. చాలా తీయగా ఉంటాయి. తీసుకో...

హనుమత్ విజయోత్సవ దినం 2024 Hanuman Jayanti

Image
అందరికీ హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు 🚩 జై శ్రీహనుమ 🙏  TELUGU VOICE ఈ రోజు చైత్ర పూర్ణిమ - హనుమత్ విజయోత్సవ దినం..  చాలా మందికి వున్న సందిగ్ధం, హనుమాన్ జయంతి ఎప్పుడు? హనుమాన్ విజయోత్సవ దినం ఎప్పుడనేది.. హనుమంతుని జన్మ తిథి చైత్ర మాసం లోనా, వైశాఖంలో చేసుకోవాలా అనే అనుమానం చాలామందికి ఉంటుంది.. అలాంటి వారు ఈ కథనం చదివి, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. [ హనుమంతుడు తీర్చిన తుంబుర నారదుల వివాదం: https://youtu.be/PDJaB6-eRmQ ] పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం, ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం రోజున జన్మించారని తెలుపబడింది.. అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు. [ హనుమకు సీతమ్మ చెప్పిన ‘బోయవాడు - ఎలుగుబంటి’ కథ!: https://youtu.be/YK8QjVW2kc0 ] అయితే, కొన్ని ఇతిహాసాల ప్రకారం, చైత్ర పౌర్ణమినాడు నికుంభుడు, తదిరత రాక్షసులను సంహరించి, హనుమంతుడు విజయం సాధించినట్లు వ్యక్తమవుతోంది. ఈ కారణంగా, ఆ రోజున హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే, చైత్ర పూర్ణిమ నాడు "హనుమంతుని విజయోత...

అంతిమ యాత్ర! ‘గరుడ పురాణం’ Garuda Puranam - Antim Yatra

Image
అంతిమ యాత్ర! జీవిత సత్యాలు..  TELUGU VOICE ‘గరుడ పురాణం’ ప్రకారం వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన పనులు! మన సనాతన ధర్మం ప్రకారం, ఆత్మ జనన-మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎనభై నాలుగు లక్షల యోనుల్లో మనుష్య జన్మ శ్రేష్ఠత - మనిషి ఏకమాత్ర కర్తవ్యం ‘ధర్మం’ గురించి మన గత వీడియోలో తెలుసుకున్నాము. అటువంటి ఉత్తమమైన జన్మ అంత్య కాలంలో, సశాస్త్రీయంగా చేయాల్సిన విధులను, పాశ్చాత్య పోకడలలో పడో, పద్ధతులు తెలియకో, Secular మూర్ఖుల ప్రభావం వలన ఇవన్నీ మూఢ నమ్మకాలుగా భావించో, అంతిమ యాత్రకు సంబంధించిన విధి విధానాలను విస్మరిస్తున్నాము. అందరూ ఈ వీడియోను చివరిదాకా చూసి, అసలైన పద్ధతులను తెలుసుకుంటారనీ, మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారనీ ఆశిస్తున్నాను.. ప్రతి హిందువూ తెలుసుకుని, తప్పక పాటించాల్సిన ఇటువంటి అత్యవసర విషయాలను అందరికీ చేరేలా ప్రయత్నిద్దాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/1s3K7fXEf_A ] శ్రీమహావిష్ణువును గరుత్మంతుడు ఇలా అడుగుతున్నాడు.. “హే భగవన్‌! మృత్యువు ఆసన్నమైనప్పుడూ, వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మలను వివరంగా వినాలని వుంది. కరుణించండి” అని ప్రార్ధించాడు.. దాన...

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🙏 Sri Rama Navami

Image
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🚩 జై శ్రీరామ 🙏  TELUGU VOICE శ్రీ రామనవమి విశిష్ఠత :  https://youtu.be/VDcEZ1quBg8?si=PEBbICHjG7yjgnxG శ్రీ రామనవమి రాముడు పుట్టిన రోజా, పెళ్లిరోజా? | What Is Sri Rama Navami and Why Do We Celebrate it?

మనిషి జన్మ! జీవిత సత్యాలు.. ‘గరుడ పురాణం’ Garuda Puranam

Image
మనిషి జన్మ! జీవిత సత్యాలు..  TELUGU VOICE ‘గరుడ పురాణం’ ప్రకారం మనుష్య జన్మ శ్రేష్ఠత - మనిషి ఏకమాత్ర కర్తవ్యం ‘ధర్మం’ ఏమిటో తెలుసా? మన సనాతన ధర్మంలోని పురాణాలు, మన మహర్షులు మనకు అందించిన వరాలు. అందులోనూ వ్యాస భగవానుడి కృతులైన అష్టాదశ పురాణాలలోని గరుడ పురాణం, మనిషి జీవన గమనానికి మార్గ దర్శకం. సనాతన ధర్మం ప్రకారం, ఆత్మ జనన-మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. అత్యంత దుర్లభమైన మనుష్య జన్మకు సంబంధించి, గరుడుడికి సాక్ష్యాత్తూ శ్రీ మహావిష్ణువు తెలియజేసిన ఆ విషయాలలో, మనిషిగా పుట్టాలంటే ఏం చెయ్యాలి? మనిషికి మృత్యువెలా ప్రాప్తిస్తుంది? శరీరాన్ని ఆశ్రయించి మరణించేది ఎవరు? అప్పుడు ఇంద్రియాలు ఏమైపోతాయి? మనిషి అస్పృశ్యుడెలా అవుతాడు? ఇక్కడ చేయబడిన కర్మకు ఫలాన్ని ఎక్కడ, ఎలా అనుభవిస్తాడు? అసలు ఎక్కడికి, ఎలా వెళ్తాడు? యమలోకానికీ విష్ణులోకానికీ ఏయే మార్గాలలో వెళతాడన్న గరుడుడి సందేహాలకు, శ్రీ మహావిష్ణువు ఇచ్చిన సమాధానాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/2eMvV6mcSnU ] “ఓయీ వినతనందనా! పరస్త్రీనిగానీ, బ్రాహ్మణుని ధనాన్నిగానీ అపహరించినవాడు, ని...

గురు మంత్రం - Guru Mantra

Image
గురు మంత్రం - Guru Mantra  TELUGU VOICE ఎవరైనా, ఎప్పుడైనా మననం చేయవచ్చు. దీని అర్ధం తెలుసుకుని, భక్తి శ్రద్ధలతో, నియమ బద్ధంగా జపించే వారికి, సర్వశుభములూ చేకూరుతాయి. మనల్ని ఉద్ధరించడానికి ఈ దివ్య ద్వాదశాక్షరీ మంత్రము, 'జగద్గురువు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల' వారిచే ఉపదేశింపబడినది.. "ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః" ఓం = సచ్చిదానందమయ బ్రహ్మ స్వరూపుడును,  హ్రీం = హృదయాకాశమునందు అంతరాత్మగా ప్రకాశించువాడును,   క్లీం = భౌతిక దేహమునందు చైతన్యముచే వ్యాపించిన వాడును అనగా సర్వ వ్యాపకుడును,  శ్రీం = చక్కని తేజస్సుచే విరాజిల్లువాడును, అయినట్టి,  శివాయ = శుభములు చేకూర్చు వానికి అనగా మోక్షసుఖము నొసగు వానికి,   బ్రహ్మణే = ఆ పరబ్రహ్మమునకు (పరమాత్మకు)  నమః = నేను నమస్కరించుచున్నాను. [ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం: https://youtu.be/Hn7wy7POWgw ] Thanks for 90K+ Subscribers