Posts

Humbling of Thondaman's pride | తొండమాన్ గర్వభంగం!

Image
తొండమాన్ గర్వభంగం! భవిష్యోత్తర పురాణంలోని గాధ!  అహంకారం గర్వం ఎంత కొంచమైనా నిలువునా దహించివేస్తుంది! కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేఙ్కటేశ్వరునికి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి పద్మావతీ దేవిని, కన్యాదానమిచ్చిన మహానుభావుడు, తొండమండలాధీశుడైన ఆకాశరాజు. ఆ ఆకాశరాజు సోదరుడే, తొండమానుడు. అతడు అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై, తిరుమల భవ్య మందిరమైన ‘ఆనందనిలయ’ నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వేఙ్కటపతిని సేవించుకునేది, తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే, నిత్యం స్వామితో నేరుగా సంభషణ చేసేవాడు! మరి అంతటి వాడికి గర్వభంగమా!? అసలేం జరిగిందో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను comment చేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/hAPcbmTx3F4 ] అలా తొండమానుడు స్వామి వారితో అత్యంత సన్నిహితంగా మెలగుతూ, సేవలు చేసుకుంటుండగా, ఒకరోజు ఆకాశవాణి, “ఆహా! ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా! శ్రీనివాసుని ప్రతి కైంకర్యుమూ నీ చేతుల మీదుగా, శ్రద్ధా భక్తులతో, అంగ రంగ వైభవంగా చేయిస్తున్నావు. రాజా! నీ

The Journey to Hell - Story of Kathopanishad (Nachiketa) | కఠోపనిషత్ కథ - నచికేతుడి పితృభక్తి!

Image
కఠోపనిషత్ కథ - నచికేతుడి పితృభక్తి! యమధర్మ రాజు నుండి అతి రహస్యమైన విద్యను ఎలా పొందాడు? పూర్వం వాజస్రవసుడనే సత్పురుషుడుండేవాడు. గౌతమవంశసంజాతుడైన అతడు, గౌతముడు, ఔద్దాలకుడు, ఆరుణి అనే పేర్లతోకూడా ప్రసిద్ధుడు. అతడొకసారి విశ్వజిత్ యజ్ఞం చేశాడు. ఆ బృహత్ యజ్ఞం చేసినవారు, యాగం చివరలో, తమ సర్వస్వాన్నీ దానం చేసేయాలి! వాజస్రవసుడు కూడా అలాగే తనకున్నదంతా దానం చేయసాగాడు. అనాదినుంచీ భారతీయులకు పశువృక్షాదులే ముఖ్యమైన సంపదలు. అందులోనూ, గో సంపద అతి ముఖ్యమైనది. మరకత మాణిక్యాలూ, హిరణ్య రజితాలకంటే గొప్పది గో సంపద. కాబట్టి, వాజస్రవసుడు ఋత్వికులకు గోదానాలు చేయసాగాడు. వాజస్రవసుడికి, మహాబుద్ధిశాలి, గుణసంపన్నుడు, పితృభక్తి పరాయణుడైన పుత్రుడున్నాడు. అతడి పేరు నచికేతుడు. చిన్న వయస్సులోనే సకల ధర్మ శాస్త్రాలనూ అభ్యసించాడు. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/D9Uk9VwwZTs ] ఆ సమయంలో నచికేతుడి దృష్టి, తన తండ్రి దానమిస్తున్న గోవుల మీద పడింది. ఆ గోవులు చాలావరకూ ముసలివి, పళ్ళు లేనివి, పాలివ్వడానికీ, ప్రసవించడానికీ శక్తిలేనివని గమనించిన నచికేతుడు, ఇలా అనుకున్నాడు.. “ఎవరైతే నిస్సారమైన గోవులను దానం చేస్తారో,

హిందూత్వం - 2 | Hinduism - History

Image
హిందూత్వం - 2 (Hinduism - History) ఆంగ్లేయులూ, వామ‌ప‌క్షీయులూ క‌లిసి, మ‌న దేశ‌పు చ‌రిత్రను క‌ల‌గాపుల‌గం చేసి, ఏలా విప్పాలో తెలియ‌ని విధంగా పీట‌ ముడులు వేసి మ‌న‌పై వ‌దిలారు. ప్రాచీన కాలంలో మ‌న భార‌తీయ మేధావులు త‌మ గ్రంథాల‌లో, కాల నిర్ణయానికి శాలివాహ‌న శ‌కాన్ని ఒక ప్రమాణంగా తీసుకున్నారు. ఈ శ‌కం సా. శ‌. 79 మార్చి 22 న, చైత్ర మాసారంభ‌మున ప్రారంభించారు. ఈ చైత్ర మాస‌పు తొలి దిన‌మే, దైవ అహోరాత్ర యుగ‌మున‌కు ఆది క‌నుక, యుగాది అనే పేరును ఆపాదించి, దానికి చాలా విశిష్టత‌ను చేకూర్చారు. కానీ ఈ కాలంలో యువ‌త, జ‌న‌వ‌రి 1 న చూపే ఉత్సాహంలో స‌గం కూడా ఉగాది నాడు క‌నిపించ‌దు. ఇప్పుడు ఎటు చూసినా ప‌రాధీనంలో ఉన్న దౌర్భాగ్యమే క‌నిపిస్తుంది. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PUzEWDiAhOw ] గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణితో ప్రారంభించ‌బ‌డిన నాటినుండి, 1879 సంవ‌త్సర‌ములు గ‌డిచిన త‌రువాత, 1957 మార్చి 22 నుండి భార‌త ప్రభుత్వం, ఈ శాలివాహన శ‌కాన్ని అధికారికంగా కాల‌మానంగా స్వీక‌రించింది. అంటే, ఇప్పుడున్న గ్రిగేరియ‌న్ క్యాలెండ‌ర్ లోని సంవ‌త్సర‌ము నుండి, 79 తీసివేస్తే, శ‌క సంవ‌త్సరం వ‌స్తుంది. ఒక గ్రిగేరియ‌న్ తేదీ

హిందూత్వం - 1 - Science and Hinduism

Image
హిందూత్వం - 1 మ‌నం కాలాన్ని ఏ విధంగా కొలుస్తాము?.. భూమి మీద ఒక ప్రామాణిక దూర‌ములోగల బిందువుల‌ను తీసుకుని, ఆ రెండు బిందువుల‌నూ, నిర్దేశిత వేగంతో చేరే స‌మ‌యాన్నీ, కాలాన్నీ, ఒక ప్రమాణంగా తీసుకోవ‌డం జ‌రుగుతుంది. అంతేక‌దా.. మ‌రి మీరు దూరాన్ని ఏ విధంగా కొలుస్తారు? అని అడిగితే దానికి  స‌మాధానం, ఇంత‌కు ముందు చెప్పిన విధానాన్నే చెప్పవ‌ల‌సి వ‌స్తుంది. ఏ విధంగా అంటే, ఒక రెండు బిందువుల‌ను తీసుకుంటే, మీరు ఒకే స‌మ‌యంలో, రెండు బిందువుల వ‌ద్దా ఉండ‌లేరు గ‌నుక, మొద‌టి బిందువు నుండి ఒక ప్రామాణిక వేగంతో, ప్రామాణిక కాలంలో, రెండ‌వ బిందువు చేర‌గ‌లిగితే, దానిని దూర‌ము అంటాం.. ఇలా ఈ రెండూ ఒక దానితో ఒక‌టి ముడిప‌డి, ఈ కాల‌ము, విశ్వముతో ఉన్న సంబంధాన్ని మ‌నకు తెల‌య‌జేస్తుంది. ఈ విష‌యాన్ని ఐన్స్టీన్ మ‌హ‌శ‌యుడు సాపేక్షతా సిద్ధాంత రూపంలో తెలియ‌ప‌రిచారు. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/HAU_0e-RybQ ] నిన్న మొన్నటి వ‌ర‌కూ వీదేశీయుల కాల‌గ‌మ‌నం ప్రకారం, సెక‌ను, నిమిష‌ము, గంట‌, దిన‌ము, వార‌ము, మాస‌ము, ఋతువు, సంవ‌త్సరం మాత్రమే ఉండేవి. సంవ‌త్సర‌ములు, అంటే, కేవ‌లం అంకెలు మాత్రమే .. ర‌శ్మ్యుద్గార‌క‌త‌, ప‌ర‌మా

గుడి! దేవుడు మనలోనే ఉన్నప్పుడు మరి గుడికి ఎందుకు వెళ్ళడం? Temple Secrets - Gudi - Aalayam

Image
గుడి! దేవుడు మనలోనే ఉన్నప్పుడు మరి గుడికి ఎందుకు వెళ్ళడం? దేవుడు అన్ని చోట్లా, అంతటా ఉన్నప్పుడు, మరి ప్రత్యేకించి దేవాలయాలకు వెళ్ళడం అవసరమా? ఈ ప్రశ్న నేటి తరం వారందరికీ కలుగుతుంటుంది.. ఆలయాలను దర్శించుకోవడం వెనుక ఎన్నో శాస్త్రీయ ప్రయోజనాలున్నాయి. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? ఈ విషయమై వేదాలు ఏం చెబుతున్నాయి? నేటి తరంలో చాలామందికి తెలియని ఇటువంటి అంశాలు ప్రతి హిందువూ తెలుసుకోవడం చాలా అవసరం.. ఈ వీడియోను అందరికీ చేరేలా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gh0S2nYUMIM ] మనదేశంలో చిన్నా పెద్దా ఆలయాలను చూసుకుంటే, వేలాది సంఖ్యలో ఉంటాయి. అయితే, అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దిష్ఠంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే, గురువులు పరిగణిస్తారు. అలాంటివే, అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే కానీ, కొన్ని ఆలయాలు మరింత పునీతమై, స్థలమాహాత్మ్యాన్ని సంతరించుకున్నాయి. భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో, అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్ల

Was being Kaikeyi easy? ‘కైకేయి’ది స్వార్ధమా? త్యాగమా?

Image
‘కైకేయి’ది స్వార్ధమా? త్యాగమా? రాముడు అడవుల పాలైనా.. భర్త మరణానికి ప్రత్యక్ష కారకురాలైనా.. రామచరితం రసరమ్య భరితం. రామాయణంలాగా లోక వ్యవహారాన్ని విస్పష్టంగా బోధించే కావ్యం మరొకటి లేదన్నది, ఆర్యోక్తి. ఆదికవి వాల్మీకి నుంచి నేటి వరకూ, రమణీయమైన రామగాధ, పలుభాషలలో, పలు రీతులలో రూపు దిద్దుకుంటూ, భారతావని లోనే కాకుండా, భారతీయుల సంస్కృతి ప్రసరించిన అన్య దేశాలలోనూ ప్రచార ప్రశస్తి పొందింది. రామాయణం ఆదికావ్యం. వాల్మీకి మహర్షి ఈ మహాకావ్యాన్ని రచించడానికి కారణం, బ్రహ్మానుగ్రహం. భారత దేశంలోనూ, భారతీయ వాఙ్మయంలోనూ, సీతారాములు ప్రతి అణువులోనూ, ప్రతి అక్షరంలోనూ ప్రకాశించే దైవదంపతులు. రామాయణాన్ని చదవడం వల్ల, తల్రిదండ్రుల పట్ల భక్తి, సోదర ప్రీతి, జ్యేష్టానువర్తనం, లోకమర్యాదానుసరణం, ప్రతిజ్ఞా పాలనం, ఆశ్రిత వాత్సల్యం, స్వామికార్య నిర్వహణం, స్వార్ధపరత్వ నివృత్తి, చిత్త శుద్ధీ, పరోపకార బుద్ధివంటి అనేక సద్గుణాలు అలవడడానికి ప్రోత్సహిస్తుంది. అటువంటి రామాయణ గాధలో, కైకేయి తన దాసీ అయిన మంథర మాటలు విని, రాముడిని ఆడవుల పాలుజేసి, భర్త మరణానికి కారకురాలై, అటు కన్నబిడ్డ ప్రేమకూ, ఇటు పెంచిన బిడ్డ మామకారానికీ దూరమైన అభాగ్య

శ్రీకృష్ణావతారతత్వం! కుచేలుడు! Sri Krishna Kuchela - Sri Krishnavatara Tatvam

Image
కుచేలుడు! శ్రీకృష్ణావతారతత్వం! నిజానికి మానవుడికి ముగ్గురు గురువులుంటారు! వారు ఎవరు? పరీక్షిత్ మహారాజు అంతరంగంలో, భక్తి భావం సంపూర్ణంగా నాటుకుంది. శ్రీకృష్ణుని మహిమలను చెప్పే కథలు ఎన్ని విన్నా, ఇంకా వినాలన్న కోరిక పెరుగుతోంది. ఎంతటి విషయలోలుడైనా, ఒక్కసారి శ్రీకృష్ణుని చరిత్ర వింటే, ఇక సంసార లంపటంలో చిక్కుకోడు. పశుపక్ష్యాదులకూ, మానవులకూ ఒక్క విషయంలోనే భేదం ఉంది. అది, చేతులతో భగవంతునికి సేవలు చేయగలగడం, చెవులతో భగవానుని పుణ్య గాథలను వినడం, శిరస్సు వంచి ఆయన పాద పద్మాలకు నమస్మరించడం, కన్నులతో ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించగలగడం, భక్తుల పాదోదకాన్ని గ్రహించడం, ఇలా ఒక్కటేమిటి, ఈ విధంగా అంగాంగం భగవంతునికై వినియోగించగలగడమే, మానవ జన్మకు సాఫల్యం. ఎవరు భగవంతుడిచ్చిన అవయవాలను భగవత్సేవకు వినియోగించరో, అతడు పాపాత్ముడు, కృతఘ్నుడు అవుతాడు. కావున ఓ మునీంద్రా! నా చివరి ఘడియల వరకూ శ్రీహరి సేవలోనే గడపాలని ఉంది. అందుకే ఆయన లీలలను నాకు చెబితే, తనివితీరా వినాలని ఉందన్నాడు. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/C7kNPs6Rn3E ] పరీక్షిత్ మహారాజు మాటలకు శుకమహర్షి ఇలా బదులిచ్చాడు. రాజా! శ్రీకృష్ణుడిత