Mahavatar Babaji's Cosmic Cobra Breath | మహావతార్ బాబాజీ – ‘విశ్వ సర్ప శ్వాస’ ప్రక్రియ!
మహావతార్ బాబాజీ – ‘విశ్వసర్పశ్వాస’!? కుండలినీ శక్తిని నిద్ర లేపటానికి ఉపయోగించే తాంత్రిక యోగమార్గం ఏమిటో తెలుసా? ఈ అనంత విశ్వంలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలూ, మనిషి మేధస్సుకందని విశేషాలూ అనంతం. మరణం లేని మానవులూ.. మరణాన్ని జయించే యోగాసనాలూ.. ఆ మహా యోగి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేకొద్దీ, సాధారణ మానవులకు నమ్మశక్యంకాని అటువంటి అద్భుతాలు కోకొల్లలు. ఆయనే మహావతార్ బాబాజీ. సుమారు 2000 సంవత్సరాలుగా, సజీవంగా ఉన్న సిద్ధ యోగి బాబాజీ గురించీ, ఆయన జీవిత విశేషాలతో, మానవాళి శ్రేయస్సుకోసం ఆయన అందించిన ‘క్రియా యోగం’ గురించీ, గతంలో మనం చేసిన వీడియోల Playlist, క్రింద description లో పొందుపరిచాను. చూడని వారు తప్పక చూడండి. ఇక ఈ రోజుటి మన వీడియోలో, ఆ సిద్ధ యోగి మనకోసం అందించిన మరో అద్భుతమైన ‘విశ్వ సర్ప శ్వాస’ గురించి తెలుసుకుని, గురవు ద్వారా నేర్చుకుని తరిద్దాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/W_hczzQyXJY ] ఈనాటికీ హిమాలయాలలో అదృశ్యరూపుడిగా సంచరిస్తున్నాడని చెప్పబడుతున్న మహావతార్ బాబాజీ, మానవ జాతి అభ్యుదయం కోసం అందించిన ఒక అపూర్వమైన వరం “క్రియా యోగం”. క్రియా యోగం అంటే, ఎవరిని వారు తెలు...