Posts

అంతర్గత శాంతీ, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటాయి? Internal Peace

Image
అంతర్గత శాంతీ, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటాయి? “ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలూ, డాబూ పెంచుకుంటే, ఏ నాటికైనా పతనం తప్పదు” అన్నది ఆర్యోక్తి.. ఉదాహరణకు, వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది. సమంగా ఉంటే బంగారం పండుతుంది. అదే అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది. ఇక్కడ నీటినే ధనం అనుకుని, వరిని మనిషి అనుకుంటే, తగినంత లేకుంటే కరవు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే తనను తాను నశింపచేసుకునే రాచ మార్గం! అదే అధికంగా ఉన్న ధనాన్ని, ఉదాహరణగా తీసుకున్న నీటిని తీసివేయడంలాగా ధనం దానం చేస్తే, తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు. ఇందుకు అద్భుతమైన ఉదాహరణ, ‘చక్వవేణుడి గాథ’. అసలు ఎవరీ చక్వవేణుడు? ఆయన ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటి? [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PZVzePvXASc ] ప్రస్తుత లోకం తీరు మారింది. ఉన్నది తినడం అటుంచి, తింటున్నది ఎదుటి వాడికి చూపిస్తూ గొప్పలు చెప్పుకునే దౌర్భాగ్యం పెరిగింది. తమదగ్గరున్న డబ్బు, బంగారం, కార్లూ, బంగళాలూ, విలాస వస్తువులూ, తిరిగిన ప్రాంతాలూ, అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా, లేదా స్టేటస్ లలో చూపాలి. చీరలూ, నగలూ ధరించి, ...

మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం! Rudraprashna - రుద్రప్రశ్న!

Image
అందరికీ శ్రావణమాసారంభ శుభాభినందనలు 🙏 మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం! శ్రీ రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. శత రుద్రీయం, యజుర్వేదంలో భాగం. ఇది శివునికి అంకితం చేయబడిన శ్లోకం. మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం. ఇది జన్మకూ, మృత్యువుకూ అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేదీ, మరల దానిని తీసుకుపోయేది కూడా, ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది. వేద శ్లోకాలలో గొప్పదైన రుద్రం, అన్ని రకాల ప్రయోజనాల కోసం, అన్ని దోషాలనూ, కష్టాలనూ తొలగించడానికి సహకరిస్తుంది. పూజలు, హోమాలలో, దీనిని వేద పండితులు పఠిస్తారు. శ్రీ రుద్రం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం, యజుర్వేదంలోని 16వ అధ్యాయంలోనిది. 'నమో' అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం వల్ల, నమకం అని పిలుస్తారు. రెండవ భాగం, యజుర్వేదంలోని 18వ అధ్యాయంలోనిది. 'చమే' అనే పదాలను పదే పదే ఉపయోగించడం వల్ల, దీనిని చమకం అని పిలుస్తారు. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/2GuNRVW62rk ] నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ | నిత్యం త్రయం ప్రయుంజనో బ్రహ్మలోకే మహీయతే || నమకం చమకం ఎవరైతే మూడు సార్లు, పురుష సూక్తంతో ప్రతి దినం చ...

Mahavatar Babaji's Cosmic Cobra Breath | మహావతార్‌ బాబాజీ – ‘విశ్వ సర్ప శ్వాస’ ప్రక్రియ!

Image
మహావతార్‌ బాబాజీ – ‘విశ్వసర్పశ్వాస’!? కుండలినీ శక్తిని నిద్ర లేపటానికి ఉపయోగించే తాంత్రిక యోగమార్గం ఏమిటో తెలుసా? ఈ అనంత విశ్వంలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలూ, మనిషి మేధస్సుకందని విశేషాలూ అనంతం. మరణం లేని మానవులూ.. మరణాన్ని జయించే యోగాసనాలూ.. ఆ మహా యోగి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేకొద్దీ, సాధారణ మానవులకు నమ్మశక్యంకాని అటువంటి అద్భుతాలు కోకొల్లలు. ఆయనే మహావతార్ బాబాజీ. సుమారు 2000 సంవత్సరాలుగా, సజీవంగా ఉన్న సిద్ధ యోగి బాబాజీ గురించీ, ఆయన జీవిత విశేషాలతో, మానవాళి శ్రేయస్సుకోసం ఆయన అందించిన ‘క్రియా యోగం’ గురించీ, గతంలో మనం చేసిన వీడియోల Playlist, క్రింద description లో పొందుపరిచాను. చూడని వారు తప్పక చూడండి. ఇక ఈ రోజుటి మన వీడియోలో, ఆ సిద్ధ యోగి మనకోసం అందించిన మరో అద్భుతమైన ‘విశ్వ సర్ప శ్వాస’ గురించి తెలుసుకుని, గురవు ద్వారా నేర్చుకుని తరిద్దాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/W_hczzQyXJY ] ఈనాటికీ హిమాలయాలలో అదృశ్యరూపుడిగా సంచరిస్తున్నాడని చెప్పబడుతున్న మహావతార్‌ బాబాజీ, మానవ జాతి అభ్యుదయం కోసం అందించిన ఒక అపూర్వమైన వరం “క్రియా యోగం”. క్రియా యోగం అంటే, ఎవరిని వారు తెలు...

గరుడ పురాణం - మనిషి పాపపుణ్యాలను లెక్కించే శ్రవణులు - Garuda Puranam

Image
‘గరుడ పురాణం’ ప్రకారం.. మనిషి పాపపుణ్యాలను లెక్కించే ‘శ్రవణులు’!? ఈ కలియుగంలో, అన్ని పురాణాలలోకీ ప్రముఖమైనవిగా పరిగణించబడేవి, మూడు. వాటిలో ప్రధానదీ, ప్రజలకు శుభాలనందించేదీ, శ్రీమద్ భాగవతం. అందుకే అన్ని పురాణాలలో భాగవతం, అత్యున్నతమైనది. తరువాత విష్ణు పురాణం, ఆ తరువాత, గరుడ పురాణంగా చెప్పవచ్చు. అటువంటి గరుడ పురాణంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను వీడియోలుగా, ఇది వరకు కొన్నింటిని అందించి ఉన్నాను. వాటి playlist ను, వీడియో క్రింద description లో పొందుపరుస్తున్నాను. మనిషి సన్మార్గంలో నడుచుకోవడానికి ఉపయోగపడే, శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి స్వయంగా తెలియజేసిన మరికొన్ని విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ATV1ynLPOGs ] “జ్ఞానసాగరా! శ్రీ మహావిష్ణూ! యమలోకంలో శ్రవణులనే వారుంటారనీ, వారు సర్వజ్ఞులనీ విని ఉన్నాను. వారిని గూర్చి తెలుసుకోవాలని కుతూహల పడుతున్నాను.” అని అన్న గరుత్మంతుడితో విష్ణుభగవానుడు.. “గరుడా! ప్రాచీన కాలంలో సమస్త స్థావర జంగమాత్మకమైన సృష్టి ఏకాకారం చెందినపుడు, నేను దానిని ఆత్మ లీనం చేసుకుని, పాల సముద్రంలో శయనించాను. అప్పుడు నా నాభ...

గురు పౌర్ణమి - శ్రీ వ్యాస పూర్ణిమ / గురు పూర్ణిమ శుభాకాంక్షలు - Guru Paurnami 2024

Image
ఈ రోజే '21 జులై, 2024' గురు పౌర్ణమి..  అందరికీ శ్రీ వ్యాస పూర్ణిమ / గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏🏻 శ్రీ వ్యాస స్తుతి.. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్‌ । పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ ।। వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే । నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ।। నారాయణుడు, ఆయన నాభి కమలం నుండి జన్మించిన బ్రహ్మ, బ్రహ్మ మానస పుత్రుడు వశిష్ఠుడు, వశిష్ఠుని సంతానమైన శక్తి, శక్తి మహర్షి పుత్రుడు పరాశరుడు, పరాశరాత్మజుడు వ్యాసుడు, ఆయన కొడుకు పరమ భాగవతోత్తముడైన శుకుడు, ఆ పరంపరలో గౌడపాదాచార్యులు, గోవింద యోగి మొదలైన వారు మన గురువులు. ఇది ఆర్ష గురు పరంపర. వీరిలో వ్యాస మహర్షి సాక్షాత్‌ విష్ణు రూపుడే. ఆయనకు నాలుగు ముఖాలు లేవు కానీ, బ్రహ్మ స్వరూపుడే. అటువంటి వ్యాస భగవానునికి నమస్కారం 🙏🏻 పరమపావనమైన ఆషాఢ పూర్ణిమ పర్వదినం ఇది. పూర్ణిమ అనగానే ఆధ్యాత్మిక సాధనకి చాలా యోగ్యమైనది. అందునా ఈ ఆషాఢ పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది గురు పూర్ణిమ అని ప్రసిద్ధి. ఇక్కడి నుంచి చాతుర్మాసాలలో వచ్చే పూర్ణిమలు అన్నీ, జ్ఞాన ప్రధానమైనటువంటి పూర్ణిమలు. జ్ఞానము అనగానే, ఆధ్యాత్మ జ్ఞానమే జ్ఞానము....

ఈ రోజు '17/07/2024' తొలి ఏకాదశి, శయన ఏకాదశి - అందరికీ శుభాకాంక్షలు! Toli Ekadasi

Image
ఈ రోజు '17/07/2024' తొలి ఏకాదశి, శయన ఏకాదశి - అందరికీ శుభాకాంక్షలు! తొలి ఏకాదశి అంటే ఏమిటి, ఎందుకు చేసుకుంటారు, దీని విశిష్ఠత ఏంటి? హిందూ సంప్రదాయాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన తొలి ఏకాదశి, పండుగలకు ఆది.  తెలుగు సంవత్సరంలో అన్ని పండగలనూ వెంట పెట్టుకుని వచ్చే తొలి ఏకాదశి విశిష్ఠత ఏంటో తెలుసుకుందాము.. తొలి ఏకాదశి అంటే ఏమిటి? ఆషాఢ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అని అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి, మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి). అవి ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే, పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, వీటిని పని చేయించే అంతరేంద్రియం అయిన మనస్సుతో కలిపితే, పదకొండు. ఈ పదకొండూ ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. తొలి ఏకాదశి విశిష్ఠత! ఆషాఢ మాస ఏకాదశినే 'తొలి ఏకాదశి'గా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి, హరి వాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అం...

గ్రహాంతర జీవులు! – ఇది నిజమా? Is there life outside of Earth? Existence of Aliens

Image
గ్రహాంతర జీవులు! – ఇది నిజమా? ఇతర గ్రహాలలో కూడా మనిషిలాంటి మేధో జీవులున్నారా? అనే ప్రశ్న, సామాన్యుడి నుండి శాస్త్రజ్ఞుల వరకూ, ఒక చిక్కుముడిగా ఉండిపోయింది. చాలా కాలం నుండి ఇతర గ్రహాలకు చెందిన జీవులు, ఎగిరే పళ్ళాలు, లేదా Flying Saucers అనబడే అంతరీక్ష విమానాలలో భూమిపైకి వచ్చి, కొందరిని అపహరించుకుని వెళ్ళినట్లు వార్తలు వింటూ ఉంటాము. ఇతర గ్రహాల నుండి వచ్చే గుర్తు తెలియని ఆకాశ ప్రయాణ సాధనాలనే U.F.O. లు, లేదా Un-Identified Flying Objects గా శాస్త్రజ్ఞులు పేర్కొంటారు. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/R90vO1zWUy0 ] చాలా దేశాలలో ఈ UFO లను చూసినట్లు, అక్కడి స్థానికులు చెప్పటం మనలో చాలామంది వినే ఉంటారు. కొందరు విజ్ఞానుల అభిప్రాయం ప్రకారం, ఈ UFO లనేవి, Galaxies గా పిలువబడే ఇతర పాలపుంతల నుండి భూమి మీదకు వచ్చిన గ్రహాంతర జీవులనీ, భూమిపైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందని ప్రాచీన కాలంలోనే, పిరమిడ్ల వంటి భారీ నిర్మాణాలు జరిపించింది, గ్రహాంతర జీవులేననీ, కొందరి నమ్మకం. ఇందుకు ఒక ఉదాహరణగా, తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం భీమేశ్వర ఆలయాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో, ఆ చుట్టుపక్కల లభ...