ఈ రోజు 'మాస శివరాత్రి'.. ఎందుకు? ఎలా జరుపుకోవాలి? Masa Shiva Ratri - Masik Shivratri
ఈ రోజు 'మాస శివరాత్రి'.. ఎందుకు? ఎలా జరుపుకోవాలి? ప్రతి నెలా అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్ధశి తిధిని, మాస శివరాత్రిగా జరుపుకుంటాము. అసలు శివరాత్రి అంటే శివుడి జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. [ నందీశ్వరుడు చెప్పిన శివరాత్రి మాహాత్మ్యం! https://youtu.be/YPCDlvLz5Sw ] మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? మహా శివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, లయానికి (మృత్యువుకు) కారకుడు కేతువు. అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. 'చంద్రోమా మనస్సో జాతః' అనే సిద్దాంతం ప్రకారం, చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు, జీవుల పై ఈ కేతు ప్రభావం ఉండటం వలన, వారి వారి ఆహారపు అలవాట్ల పై ప్రభావం చూపడం వలన, జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సంయమనాన్ని కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకో కూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి, కొన్ని సమయాలలో తమకే కాకుండా, తమ సమీపంలో ఉన్న వారి యొక్క మనస్సు, ఆరోగ్యం, ధన