Posts

Reincarnation of Arjuna a Hagiography | కలియుగంలో అర్జునుడు ‘పునర్జన్మ – మోక్షం’!

Image
ఆత్మీయ మిత్రులందరికీ 'భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు' 🚩🙏 పరమాత్ముడికై సంపూర్ణ శరణాగతీ, ఆత్మ నివేదనా ఎలా ఉండాలి? కలియుగంలో అర్జునుడు ‘పునర్జన్మ – మోక్షం’! పంచమ వేదంగా పేరుగాంచిన వ్యాస విరచిత జయకావ్యం - మహాభారతంలో, పాండవుల స్వర్గారోహణ గురించి వివరించబడివున్నది. 17వ పర్వమైన మహా ప్రస్థానిక పర్వం ప్రకారం, పాండవులు సర్వమూ త్యజించి, స్వర్గానికి పయనమైనట్లు చెప్పబడింది. ఆ విషయాలను వివరిస్తూ, 'పాండవులు స్వర్గానికి వెళ్లిన దారి ఎక్కడుంది?' అనే శీర్షికన గతంలో మనం వీడియో చేసి ఉన్నాము. చూడని వారు అదికూడా తప్పక చూడండి. అలా ఆ జన్మను ముగించిన పాండవ మధ్యముడు 'అర్జునుడి' మరుజన్మ వివరాలు ఏమిటి? అని తెలుసుకునే ముందు, ద్వాపరయుగంలో అర్జునుడు శివుడి గురించి తపస్సు చేయగా, పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు గానీ, మోక్షం ప్రసాదించలేదు ఆ పరమేశ్వరుడు. ‘కలియుగంలో బోయ వానిగా జన్మించి మోక్షం పొందుతావ’ని అర్జునుడికి శివుడు చెప్పినట్లు మన ఇతిహాసాలలో పేర్కొనబడింది. దాని ప్రకారం అర్జునుడు బోయవానిగా జన్మించి, శివుడి అనుగ్రహాన్ని పొందాడని ప్రతీతి. ఆ బోయవాడి పుట్టుపూర్వోత్తరాలనూ, ఆతడు కైవల్యాన్ని ...

Sabarimala: Original Ayyappa's Idol Vandalised? | శబరిమల అయ్యప్ప! దైవ స్థాపిత విగ్రహం ఏమయ్యింది?

Image
శబరిమల అయ్యప్ప! దైవ స్థాపిత విగ్రహం ఏమయ్యింది! నేడు భక్తులు దర్శించుకునే అయ్యప్ప స్వామి విగ్రహం పరశురాముడు ప్రతిష్ఠించినది కాదా? స్వామియే శరణం అయ్యప్ప అంటూ ప్రపంచం దద్దరిల్లి పోతోంది. ఆ హరిహర సుతుడిపైనున్న నమ్మకం, ప్రేమ, భక్తికి గుర్తుగా, ఆయప్ప మాలను ధరించి, మండలం రోజుల పాటు దీక్షబూనుతుంటారు ప్రతి సంవత్సరం. కార్తీక మాసం మొదలవ్వగానే, మనకు ఎక్కడ చూసినా ఆ మణికంఠుడి మాల ధరించిన స్వాములే కనిపిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఆయప్ప మాల వేసుకుని వచ్చే కోట్లాది మంది స్వాములతో కిక్కిరిసి పోయి ఉంటుంది శబరిమల. ప్రతి సంవత్సరం కోట్లాది మంది దర్శించుకునే అయ్యప్ప స్వామి విగ్రహం, ఆనాటి దైవ స్థాపిత విగ్రహమేనా? అసలైన విగ్రహం పళనిలోని కుమారస్వామి ఆలయంలో ఉన్న నవ పాషాణ విగ్రహం లాంటిదా? మరి అసలైన విగ్రహానికి ఏమైంది..? ఇప్పుడున్న విగ్రహం అక్కడికి ఎలా చేరింది..? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Z1osWZdk17g ] కార్తీక మాసంలోనే కాకుండా, ప్రతి నెల కొన్ని ప్రత్యేక...

BARBARIK the Ancient Indian AI Robot బర్బరీకుడు! - 18 రోజుల మహాభారత యుద్ధాన్ని ఒక్కడే ఒకే నిమిషంలో ముగించగల పాండవ వీరుడి మరణాన్ని కృష్ణుడు ఎందుకు కోరాడు?

Image
18 రోజుల మహాభారత యుద్ధాన్ని ఒక్కడే ఒకే నిమిషంలో ముగించగల పాండవ వీరుడి మరణాన్ని కృష్ణుడు ఎందుకు కోరాడు? ఒకే ఒక్క నిముషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించ‌గ‌ల వీరుడూ, అభిమన్యుడికంటే చిన్నవాడైనా, భీమార్జునులను మించిన మహాయోధుడూ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బర్బరీకుడు. మరి అంతటి మహావీరుడిని, పైగా పాండవుల సంతతికి చెందినవాడిని, పాండవ పక్షపాతిగా ముదరింపబడిన శ్రీకృష్ణుడు  ఎందుకు వధించాడు? తన తలను శ్రీ కృష్ణుడికి సమర్పించి ప్రాణ త్యాగం చేసికూడా, బ‌ర్బరీకుడు అమ‌రుడెలా అయ్యాడు? కృష్ణ పరమాత్ముడి చేత వధింపడిన అతడు, ‘ఖాటూశ్యాం బాబా’గా భారతదేశంలో పూజలు అందుకోవడం ఏమిటి? అసలు ఎవరీ బర్బరీకుడు? అత‌ని చరిత్రేమిటి? మహా భారతంలో బర్బరీకుడి చావుకూ, అతని ముందు జన్మకూ ఉన్న కర్మ బంధం ఏమిటి? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/fgnxOIlHXL0 ] నేటికి సుమారు 1000 సంవత్సరాల క్రితం, అంటే, సామాన్య శకం 1027 వ సంవత్సరంలో, రాజస్థాన్ లోని ఒక ప్రాంతంలో ఒక ఆవు ప్రతి ర...

హరిహర 108 నామాలు.. యమధర్మరాజ కృతం.. Harihara Ashtottara Shatanama Stotram

Image
హరిహర 108 నామాలు.. యమధర్మరాజ కృతం.. హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రమ్ - Harihara Ashtottara Shatanama Stotram 108 శివకేశవుల నామాలు జీవితంలో ఒక్కసారైనా పఠిస్తే, యమధర్మరాజు నుంచి విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అదీ ముఖ్యంగా వారణాసికి వెళ్లినప్పుడు, మణికర్ణిక తీర్థం వద్ద శివకేశవులను 108 నామాలతో స్తుతించిన వారికి ఇక నరక బాధలంటూ ఉండవని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శివకేశవులను స్తుతించడం మాత్రమే చేయాలి. గోవిన్ద మాధవ ముకున్ద హరే మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే || దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౧|| గఙ్గాధరాన్ధకరిపో హర నీలకణ్ఠ వైకుణ్ఠ కైటభరిపో కమఠాబ్జపాణే|| భుతేశ ఖణ్డపరశో మృడ చణ్డికేశ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౨ || విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే గౌరీపతే గిరిశ శఙ్కర చన్ద్రచూడ || నారాయణాసురనిబర్హణ శార్ఙ్గపాణే త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౩|| మృత్యుఞ్జయోగ్ర విషమేక్షణ కామశత్రో శ్రీకాన్త పీతవసనాంబుద నీల శౌరే || ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి  ||౪|| లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య శ...

Shocking Facts About Shiva's Physical Appearance | శివుడి గురించి చాలామందికి తెలియని నమ్మలేని నిజాలు!

Image
శివుడి గురించి చాలామందికి తెలియని నమ్మలేని నిజాలు!? ఆది మధ్యాంత రహితుడు, నిరాకారుడు, నిష్కళంకుడు, జటాజూట ధారి, నీలకంఠుడు, తినేత్రుడు, స్మశాన వాసి, కైలాస నివాసి, త్రిశూల ధరుడు అంటూ శత కోటి నామాలతో, అంతులేని సద్గుణాలు కలిగిన ఆ పరేమేశ్వరుడిని కొలుస్తూ ఉంటాము. స్వభావరీత్యా లయకారుడే అయినా భోళా శంకరుడు ఆ మహేశ్వరుడు. ఇలా వర్ణిస్తూ పోతే జీవిత కాలం సరిపోదు. మన వేద, పురాణ, ఇతిహాసాలలో, ఆ శివయ్య స్వభావం గురించీ, ఆయన రూపు రేఖల గురించీ ఎంతో వివరణ ఉంది. అందులో స్వామి ఎక్కువగా నాగుపామును మేడలో ధరించి, ఒంటికి పులి చర్మం కట్టుకుని, ఒళ్ళంతా చితాభస్మం పూసుకుని తిరుగుతాడనీ, లింగ రూప ప్రియుడనీ తెలిసిందే. అసలు ఆయన నిజ స్వరూపం ఎలాంటిది? ఆయన ఎంత ఎత్తు ఉంటాడు? ఆయనకి శివుడనే పేరెలా వచ్చింది? అసలు ఆయన మానవ రూపంలో ఉంటాడా? లేక గ్రహాంతర వాసిలా కనిపిస్తాడా? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/vPad4lqMF48 ] మానవ మేధస్సు ఎంత వృద్ధి చెందినా, ఈ విశాల విశ్వాన్ని సృ...

జంతుబలి! Pashu Bali - Animal Sacrifice: Ritual Mystification and Mythical Demystification in Hinduism

Image
జంతుబలి!  Animal Cruelty vs Religious Sacrifice - Is Animal Sacrifice an Ethical Act? ఆది నుంచీ మానవుడు అవలంభిస్తున్న ఓ పద్ధతి ‘శక్తి ఆరాధన’. నేల, నీరు, నింగి, నిప్పు, వాయువు అనబడే పంచ భూతాలతో పాటు, సృష్టికి వెలుగునిచ్చే సూర్య చంద్రుల వంటి వాటిని కూడా అపూర్వ దైవ శక్తులుగా భావించి, అనాదిగా భూమిపై మనుగడ సాగించిన మానవులందరూ కొలిచే వారని చరిత్ర చెబుతోంది. కోరకుండానే మంచి చేసే ఆ దేవతలను సంతృప్తి పరిచేలా పూజలు చేసి వరాలడిగితే వాటిని వెంటనే తీరుస్తారనే నమ్మకం, రాను రాను మనుష్యులలో బలంగా నాటుకు పోయింది. ఈ క్రతువులోనే జంతు బలుల ప్రక్రియ పుట్టుకొచ్చినట్లు చరిత్రకారుల వాదన. ఈ మాట వినగానే మనకి గ్రామదేవతల ముందిచ్చే జంతుబలులు గుర్తుకు వస్తాయి. నేడు చాలా మంది జంతుబలి ఇవ్వకూడదనీ, అది అనాగరిక చర్య అనీ వాదించడం కూడా మనం వింటూ ఉంటాము. మరి అసలు జంతుబలి ఇవ్వవచ్చా? మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? అసలు గ్రామ దేవతలకే ఎక్కువగా జంతుబలులు ఎందుకు ఇస్తూ ఉంటారు? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్...

MIND-BLOWING Secrets of HELL (Narakam) Punishments Revealed నరకము - శిక్షలు!

Image
నరకము - శిక్షలు! ఇక్కడే మనం ఇన్ని బాధలు పడుతున్నప్పుడు మళ్ళీ నరకము, శిక్షలు అవసరమా? దైవం కరుణాసముద్రుడు. సకల ప్రాణికోటికీ ఆయన సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాడు. తాననుకున్న పనులను చేసుకుంటూనే సచ్చిదానందాన్ని పొందవచ్చు. ఎవరు ఎన్ని తప్పులు చేసినా, ఆ పరమేశ్వరుడు కోపగించుకోడు, ద్వేషంతో దండించడు. కానీ, ఆయన రచించిన వ్యవస్థలో, జీవులు తమ తప్పులకు తగిన దండనను అనుభవించ వలసి రావటం అనేది, భవిష్యత్తులో మనం ఎక్కువ యోగ్యతను పొందటం కోసమే. స్వర్గ నరకాల వ్యవస్థ ఈ దృష్టికోణంతో రచింప బడినదే. మృత్యువు తరువాత వెంటనే మరో దేహం ధరించటం వీలుకాదు. నూతన దేహ ప్రాప్తికి ముందు జీవి, మనోమయ, ప్రాణమయ దేహం చేత, సుకృత, దుష్కృత, సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. గరుడ పురాణంలో, కఠోపనిషత్తు వంటి గ్రంధాలలో చెప్పబడిన వివరణతో, గతంలో మనం కొన్ని వీడియోలు చేసి ఉన్నాము. చూడని వారు అవి కూడా చూస్తే మరికొంత అవగాహన వస్తుంది. ఇక వాస్తవంగా స్వర్గ నరకాలేమిటి, అక్కడి శిక్షలు, భోగాల వంటి విషయాలు తెలుసుకోవడం కోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీ...